AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shiva Re Release: థియేటర్లలోకి నాగార్జున కల్ట్ క్లాసిక్ మూవీ.. శివ రీ రిలీజ్ డేట్ చెప్పిన నాగ్..

సాధారణంగా సినిమా ప్రపంచంలో కొన్ని చిత్రాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాగే కొన్ని కథలు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆ సినిమా కథ, నటీనటుల నటన, విజువల్స్, డైలాగ్స్ అడియన్స్ మదిని దాటి వెళ్లవు. ఇక హీరో మేనరిజం గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటికీ చాలా మంది తమకు నచ్చిన హీరో స్టైల్, యాటిట్యూడ్ ఫాలో అవుతుంటారు. అలాంటి ఎవర్ గ్రీన్ హిట్ చిత్రాల్లో శివ ఒకటి.

Shiva Re Release: థియేటర్లలోకి నాగార్జున కల్ట్ క్లాసిక్ మూవీ.. శివ రీ రిలీజ్ డేట్ చెప్పిన నాగ్..
Shiva
Rajitha Chanti
|

Updated on: Sep 20, 2025 | 6:10 PM

Share

టాలీవుడ్ మన్మథుడు, అక్కినేని నాగార్జున కెరీర్ మలుపు తిప్పిన సినిమా శివ. అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో నయా రికార్డులు సృష్టించిన మూవీ ఇది. 1989లో విడుదలైన ఈ సినిమా థియేటర్లలో సంచలనం సృష్టించింది. అప్పటి వరకు వచ్చిన మాస్ యాక్షన్ చిత్రాలకు మించి ప్రతి అంశంలోనూ న్యూ ట్రెండ్ క్రియేట్ చేసిన సినిమా ఇది. నాగార్జున సినీప్రయాణంలోనే కల్ట్ క్లాసిక్ హిట్ మూవీగా నిలిచిపోయింది. డైరెక్టర్ రాప్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లోనే కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ చిత్రంలో నాగ్ స్టైల్, యాక్టింగ్, ఆర్జీవీ మేకింగ్ కు యూత్ ఫిదా అయిపోయారు. ఇప్పటికీ శివ సినిమా నెట్టింట ట్రెండ్ అవుతూనే ఉంటుంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన శివ మూవీ ట్రెండింగ్ లో ఉంటుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ చిత్రాన్ని మరోసారి అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు మేకర్స్.

ఇవి కూడా చదవండి : Cinema: కాంతార, కేజీఎఫ్ చిత్రాలను వెనక్కు నెట్టింది.. అప్పుడు థియేటర్లు.. ఇప్పుడు ఓటీటీని ఊపేస్తోన్న మూవీ..

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై శివ సినిమాను నిర్మించగా.. ఇందులో అమల కథానాయికగా నటించారు. అలాగే ఇందులో తనికెళ్ల భరణి, రఘువరన్, జేడీ చక్రవర్తి కీలకపాత్రలు పోషించారు. థియేటర్లలో విడుదలైన 36 ఏళ్ల తర్వాత మరోసారి రిలీజ్ అవుతుంది. ఇప్పుడు 4K ఫార్మాట్ లో ఈ సినిమాను అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. తాజాగా శివ సినిమా రీరిలీజ్ డేట్ ను కింగ్ నాగార్జున అధికారికంగా ప్రకటించారు. దివంగత లెజండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు జయంతి (సెప్టెంబర్ 20) ఈ సినిమా రీరిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు. ఈ సినిమాను నవంబర్ 14న మరోసారి విడుదల చేయనున్నారు.

ఇవి కూడా చదవండి : Actress: అప్పుడు స్కూల్లో టీచర్.. తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?

ఈ విషయాన్ని తెలియజేస్తూ.. “నా తండ్రి ఏఎన్నార్ బర్త్ డే సందర్భంగా.. ఇండియన్ సినిమాను షేక్ చేసిన సినిమాను ఇప్పుడు మరోసారి తీసుకువస్తున్నామని ప్రకటిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. అన్నపూర్ణ స్టూడియోస్, రామ్ గోపాల్ వర్మ పాత్ బ్రేకింగ్ మూవీ శివ 4K నవంబర్ 14న థియేటర్లలో గ్రాండ్ రీరిలీజ్ కానుంది. బిగ్ స్క్రీన్ పై డాల్బీ అట్మాస్ సౌండ్ తో కల్ట్ క్లాసిక్ మూవీని చూసేయ్యండి” అంటూ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, బాలకృష్ణతో సూపర్ హిట్ సినిమాలు.. 55 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగల్.. ఇప్పటికీ యూత్‏లో యమ క్రేజ్..