AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress : ఫస్ట్ సినిమా అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే.. 15 ఏళ్లకు బ్లాక్ బస్టర్ హిట్టు అందుకున్న హీరోయిన్.. తర్వాత..

16 ఏళ్ల వయసులోనే సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసేందుకు స్కూల్ మధ్యలోనే వదిలేసింది. ముంబై వెళ్లి అవకాశాల కోసం ప్రయత్నిస్తుండగా.. ఆమె అందంగా లేదని ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. అలాగే అనేక తిరస్కరణలకు గురైంది. 2008లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఫస్ట్ మూవీ అట్టర్ ప్లాప్ అయ్యింది.

Actress : ఫస్ట్ సినిమా అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే.. 15 ఏళ్లకు బ్లాక్ బస్టర్ హిట్టు అందుకున్న హీరోయిన్.. తర్వాత..
Adah Sharma
Rajitha Chanti
|

Updated on: Sep 20, 2025 | 5:51 PM

Share

యాక్టింగ్ అంటే విపరీతమైన ఇష్టం. చిన్నప్పటి నుంచే నటి కావాలని కలలు కంది. దీంతో స్కూల్ లైఫ్ మధ్యలోనే వదిలేసి ముంబైకి వెళ్లింది. ఎన్నో ఆడిషన్స్ ఇచ్చింది. అదే సమయంలో అనేక విమర్శలు ఎదుర్కొంది. అయినా పట్టు వదలకుండా అవకాశాల కోసం ప్రయత్నించింది. చివరకు 2008లో 1920 సినిమాతో కథానాయికగా అరంగేట్రం చేసింది. కానీ ఆమె తొలి సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత కూడా ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. కానీ 2023లో ఆమె నటించిన ఓ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఆమె కెరీర్ మలుపు తిరిగింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ ఎవరో తెలుసా.. ? ఆమె పేరు ఆదా శర్మ.

ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, బాలకృష్ణతో సూపర్ హిట్ సినిమాలు.. 55 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగల్.. ఇప్పటికీ యూత్‏లో యమ క్రేజ్..

అదా శర్మ తన కెరీర్‌ను 2008లో ప్రారంభించింది. ఆమె తొలి చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. హిందీలో అనేక చిత్రాల్లో నటించింది. తెలుగులో హార్ట్ అటాక్ సినిమాతో అరంగేట్రం చేసింది. కానీ ఆ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేదు. దాదాపు 15 సంవత్సరాలపాటు సరైన బ్రేక్ కోసం ఎదురుచూసింది. చివరకు 2023లో ది కేరళ స్టోరీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. ఈ సినిమాతో ఆమె పేరు పాన్ ఇండియా లెవల్లో మారుమోగింది. 15 సంవత్సరాల పాటు సరైన బ్రేక్ కోసం కష్టపడింది. ఈ సినిమాలో తన నటనతో ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

ఇవి కూడా చదవండి : Actress: అప్పుడు స్కూల్లో టీచర్.. తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?

ఈ సినిమా తర్వాత హిందీలో ఒకటి రెండు చిత్రాల్లో నటించిన ఆదా శర్మ ఇప్పుడు మళ్లీ సైలెంట్ అయ్యింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంటుంది. తెలుగులో హార్ట్ అటాక్ తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి చిత్రం సెకండ్ హీరోయిన్ గా కనిపించింది.

ఇవి కూడా చదవండి : Tollywood : 19 ఏళ్ల వయసులో 31 ఏళ్ల స్టార్ హీరోతో పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..

View this post on Instagram

A post shared by Adah Sharma (@adah_ki_adah)

ఇవి కూడా చదవండి : Cinema: కాంతార, కేజీఎఫ్ చిత్రాలను వెనక్కు నెట్టింది.. అప్పుడు థియేటర్లు.. ఇప్పుడు ఓటీటీని ఊపేస్తోన్న మూవీ..

Follow Us
సీలింగ్ ఫ్యాన్ రెక్కలు వంకరగా ఎందుకు ఉంటాయో తెలుసా? సైన్స్ ఇదే!
సీలింగ్ ఫ్యాన్ రెక్కలు వంకరగా ఎందుకు ఉంటాయో తెలుసా? సైన్స్ ఇదే!
రక్తం కారేలా హీరోయిన్ పెదవి కొరికిన స్టార్ హీరో..
రక్తం కారేలా హీరోయిన్ పెదవి కొరికిన స్టార్ హీరో..
అతడు లేకపోతే నేను ఇండస్ట్రీకి వచ్చేవాడినే కాదు..
అతడు లేకపోతే నేను ఇండస్ట్రీకి వచ్చేవాడినే కాదు..
మొబైల్‌ యూజర్లకు బిగ్‌ అలర్ట్‌.. నవంబర్‌ 1 నుంచి కొత్త రూల్‌..!
మొబైల్‌ యూజర్లకు బిగ్‌ అలర్ట్‌.. నవంబర్‌ 1 నుంచి కొత్త రూల్‌..!
ముగ్గురిని మింగేసిన నీటి కుంట..!
ముగ్గురిని మింగేసిన నీటి కుంట..!
అనంత్‌ అంబానీ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న బ్లింకిట్ ఏజెంట్!
అనంత్‌ అంబానీ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న బ్లింకిట్ ఏజెంట్!
డబుల్ ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్.. నెటిజన్స్ కామెంట్స్ ఇవే..
డబుల్ ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్.. నెటిజన్స్ కామెంట్స్ ఇవే..
ఇంటర్ విద్యార్థి అద్భుత ఆలోచన.. షిప్పింగ్ కంటైనర్‌లో క్లాస్‌రూమ్!
ఇంటర్ విద్యార్థి అద్భుత ఆలోచన.. షిప్పింగ్ కంటైనర్‌లో క్లాస్‌రూమ్!
పచ్చటి కొబ్బరిబోండం చూసి మోసపోకండి.. ఎక్కువ నీళ్లున్న కాయను..
పచ్చటి కొబ్బరిబోండం చూసి మోసపోకండి.. ఎక్కువ నీళ్లున్న కాయను..
నాలుగు రోజుల్లో వెండి ధర రూ.16 వేలు పతనం..బంగారం ఎంత తగ్గిందంటే..
నాలుగు రోజుల్లో వెండి ధర రూ.16 వేలు పతనం..బంగారం ఎంత తగ్గిందంటే..