అక్కినేని అభిమానులకు అదిరిపోయే న్యూస్ చెప్పారు కింగ్ నాగార్జున. వైల్డ్ డాగ్ సక్సెస్ జోష్‌లో ఉన్న కింగ్… ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్ ఇచ్చారు. అక్కినేని నాగేశ్వరరావు బయోపిక్ తెరకెక్కించే ప్లాన్ ఉందని… భయంతో జాగ్రత్తగా ఆ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. ఈ న్యూస్‌తో అక్కినేని అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు.
అంతేకాదు.. తన ఫిట్‌నెస్.. మూవీ సెలక్షన్ గురించి కూడా ఇంట్రస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. ఏజ్ అంత పెద్ద మ్యాటరేం కాదు.. ఈ వయసులోనూ ఇలాంటి సినిమాలు చేయటం పెద్దగా రిస్క్ అనేం అనిపించలేదన్నారు. అంతేకాదు.. ప్రేమించే పని చేస్తున్నప్పుడు అది కష్టమన్న ఫీలింగే ఉండదన్నారు నాగ్.
హైదరాబాద్ బ్లాస్ట్ నేపథ్యంలో తెరకెక్కిన వైల్డ్ డాగ్ సినిమాలో ఎన్‌ఐఏ ఆఫీసర్ విజయ్ వర్మ రోల్‌లో నటించారు నాగార్జున. అహిషోర్ సోలోమన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో దియా మీర్జా, సయామీ ఖేర్ కీ రోల్స్‌లో నటించారు. ఈ మూవీ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. టెర్రరిజం నేపథ్యంలో ఇప్పటి వరకు చాలా మూవీస్ వచ్చాయి. అన్నింట్లోనూ దేశంలో అరాచకాలు సృష్టించి మరో దేశానికి పారిపోయిన టెర్రరిస్టును.. హీరో అండ్ టీం వెళ్లి తీసుకొస్తారు, లేదంటే అక్కడే వాళ్లను మట్టుబెడతారు. నాగార్జున వైల్డ్ డాగ్ కూడా అలాంటి మూవీనే. హైదారాబాద్‌లో జరిగిన బ్లాస్ట్స్ నేపథ్యంలో యదార్థ సంఘటనలను తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు సోలమన్. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)లో ఏసీపీగా పనిచేసే విజయ్ వర్మగా నాగ్ ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు.
Also Read: క్రేజీ రికార్డుపై కన్నేసిన వెంకీ.. సీనియర్ హీరో జోరు మాములుగా లేదుగా..
‘ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్’.. లుక్స్, గ్రేస్ విషయంలో అదే ఫామ్‌లో సీనియర్స్