AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love Story: ‘లవ్ స్టోరీ’ సినిమా రిలీజ్ అప్పుడే.. డేట్ లాక్ చేసిన చిత్రయూనిట్ ?

కరోనా కారణంగా థియేటర్లు మూతపడడంతో షూటింగ్ పూర్తి చేసిన సినిమాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం తిరిగి

Love Story: 'లవ్ స్టోరీ' సినిమా రిలీజ్ అప్పుడే.. డేట్ లాక్ చేసిన చిత్రయూనిట్ ?
Love Story
Rajitha Chanti
|

Updated on: Aug 13, 2021 | 7:06 AM

Share

కరోనా కారణంగా థియేటర్లు మూతపడడంతో షూటింగ్ పూర్తి చేసిన సినిమాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం తిరిగి థియేటర్లు తెరుచుకోవడంతో తమ చిత్రాలను విడుదల చేసే పనిలో పడ్డారు మేకర్స్. ఇటీవల విడుదలైన ఎస్ఆర్. కళ్యాణ మండపం మూవీ కలెక్షన్స్‏లో దూసుకుపోతుంది. గత రెండు మూడు నెలలుగా వెండితెర వినోదానికి దూరమైన ప్రేక్షకులను తిరిగి థియేటర్ల వైపుకు నడిపించడంలో ఎస్ఆర్. కళ్యాణ మండపం సినిమా విజయవంతమైందనే చెప్పుకోవాలి. దీంతో చిన్న సినిమాల నుంచి భారీ బడ్జెట్ చిత్రాల వరుక వీలైనంత తొందరగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. అయితే కరోనా కారణంగా వాయిదా పడిన శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ, నాని టక్ జగదీష్ రిలీజ్ డేట్స్‏పై ఇప్పటికీ సందేహాలు వీడడం లేదు. గత కొద్ది రోజులుగా నాని టక్ జగదీష్ సినిమా ఓటీటీలో విడుదల కాబోతున్నట్లుగా కథనాలు వెలువడ్డాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లవ్ స్టోరీ సినిమాపై లెటేస్ట్ బజ్ వినిపిస్తోంది. అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది. అయితే కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. దీంతో లవ్ స్టోరీ సినిమాను థియేటర్లలలో నాలుగు షోలు వేసినప్పుడే విడుదల చేస్తామని గతంలో ఈ మూవీ మేకర్స్ వెల్లడించారు. ఇక తాజా సమాచారం ప్రకారం లవ్ స్టోరీ సినిమాను వినాయక చవితి సందర్బంగా విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ మూవీ వచ్చేనెల అంటే సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారట మేకర్స్. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది.

Also Read: Gayatri Bhargavi: కేటుగాళ్లు చేసిన పనికి షాక్ అయిన యాంకర్.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన గాయత్రి భార్గవి..

MS Dhoni Meets Vijay: మాస్టర్‌తో మిస్టర్ కూల్.. దళపతికి సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ధోని.. నెట్టింట్లో ఫ్యాన్స్ సందడి

Viral Photos: సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న DDL బ్యూటీ కూతురు.. తాజాగా వైరల్‌గా మారిన తల్లితో జిమ్‌కు కలిసి వెళ్తున్న ఫోటోలు..