
హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు యంగ్ హీరో నాగశౌర్య. ఈ ప్రామిసింగ్ హీరో ఇటీవల తన తదుపరి సినిమాలు ఒకదానికొకటి భిన్నంగా, కమర్షియల్ గా విజయాలు అందుకునే చిత్రాలుగా ఉంటాయని ప్రకటించారు. గురువారం ఆయన 24వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. #NS24 అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ అరుణాచలం దర్శకత్వం వహించనున్నారు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమా నాగశౌర్యకు పర్ఫెక్ట్ యాప్ట్ స్క్రిప్ట్. వైష్ణవి ఫిలింస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం 1 గా శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించనున్నారు. బేబీ అద్వైత, భవిష్య ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
దర్శకుడు ఎస్‌ఎస్ అరుణాచలం స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్న ఈ సినిమాలో నాగశౌర్య విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రం త్వరలో గ్రాండ్ గా ప్రారంభోత్సవం జరుపుకోనుంది. ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ తర్వలోనే స్టార్ట్ కానుంది. కొందరు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తుండగా, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలో తెలియజేయనున్నారు.
ఇక ఇటీవల రష్మీ, నందు జంటగా నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హజరయిన నాగశౌర్య ఆసక్తికర కామెంట్స్ చేశారు. నాగ సౌర్య మాట్లాడుతూ. “మంచి కథతో తీసిన ఈ సినిమా ట్రైలర్, పాటలు చూస్తుంటే ఈ సినిమా చూడాలనిపిస్తుంది. థియేటర్స్ నుండి వచ్చిన ఆర్టిస్టులు అందరినీ ఈ సినిమాకు తీసుకువచ్చి వారికి అవకాశం కలిపించడం చాలా గ్రేట్, కెమెరామెన్ విజువల్స్ బాగున్నాయి హీరో, హీరోయిన్ లిద్దరూ చాలా బాగా నటించారు . రష్మీ గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. అలాంటి మంచి పేరున్న తను హీరో నందుకు సపోర్ట్ చేయడానికి ఈ సినిమాకు డబ్బులు తీసుకోకుండా ఆటోలో తిరిగింది అని విన్నాను. తనకు సినిమా పై ఎంత ప్యాషన్ ఉందో అర్థమవుతుంది. నందు ఈ సినిమా కొరకు చాలా కష్టపడ్డాడు.మంచి కంటెంట్ ను నమ్ముకొని తీసిన, దర్శక,నిర్మాతలకు, చిత్ర యూనిట్ అందరికీ ఈ సినిమా టైటిల్ మాదిరే ఈ సినిమా బిగ్ బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను” అన్నారు.
The Game is ON for the BRAND NEW ACTION ENTERTAINER ??@IamNagashaurya’s #NS24 ❤️?
In @vaishnavi_films‘ #ProductionNo1Story, Screenplay & Direction by @Arunachalam_SS?
Produced by #SrinivasaRaoChintalapudi, #VijayKumarChintalapudi,
Dr.#AshokKumarChintalapudi pic.twitter.com/w9qtn9DUGn— S Abishek Raaja (@cinemapayyan) November 3, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.