Naga Chaitanya: ఒక్కసారిగా స్క్రీన్ పై కనిపించిన సమంత.. నాగచైతన్య రియాక్షన్ చూశారా.. వీడియో వైరల్..

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలోని పలు థియేటర్లలో మనం సినిమా స్పెషల్ షోస్ రన్ అవుతున్నాయి. ఇప్పటికీ ఈ చిత్రానికి అడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. తాజాగా రీరిలీజ్ చేసిన సినిమాకు అటు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తుంది. అక్కినేని కుటుంబానికి చెందిన మూడు తరాల హీరోలు ఇప్పుడు మళ్లీ తెరపై కనిపించడం చూసి ఎమోషనల్ అవుతున్నారు ఫ్యాన్స్

Naga Chaitanya: ఒక్కసారిగా స్క్రీన్ పై కనిపించిన సమంత.. నాగచైతన్య రియాక్షన్ చూశారా.. వీడియో వైరల్..
Naga Chaitanya
Follow us
Rajitha Chanti

|

Updated on: May 24, 2024 | 12:17 PM

తెలుగు ఎప్పటికీ మర్చిపోలేని సినిమాల్లో మనం ఒకటి. అక్కినేని కుటుంబం మొత్తం కలిసి నటించిన ఈ సినిమాకు అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్, సమంత ప్రధాన పాత్రలలో నటించిన ఈ క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 2014 మే 23న గ్రాండ్ గా విడుదలైంది. అప్పట్లో ఈమూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. మనం సినిమా విడుదలై పదేళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఈ చిత్రాన్ని మరోసారి రిలీజ్ చేసింది చిత్రయూనిట్. రెండు తెలుగు రాష్ట్రాల్లో నిన్నటి నుంచి మనం మూవీ స్పెషల్ షోలను ప్రదర్శిస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలోని పలు థియేటర్లలో మనం సినిమా స్పెషల్ షోస్ రన్ అవుతున్నాయి. ఇప్పటికీ ఈ చిత్రానికి అడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. తాజాగా రీరిలీజ్ చేసిన సినిమాకు అటు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తుంది. అక్కినేని కుటుంబానికి చెందిన మూడు తరాల హీరోలు ఇప్పుడు మళ్లీ తెరపై కనిపించడం చూసి ఎమోషనల్ అవుతున్నారు ఫ్యాన్స్.

ఇదిలా ఉంటే.. నిన్న రాత్రి హైదారాబాద్ 70 ఎంఎంలో జరిగిన మనం స్పెషల్ స్క్రీనింగ్ చూసేందుకు మూవీ డైరెక్టర్ విక్రమ్ తోపాటు హీరో నాగచైతన్య హాజరయ్యారు. అభిమానుల మధ్యలో కూర్చుని మనం సినిమా చూస్తూ ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ఈ మూవీలో సామ్ కీలకపాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అయితే స్క్రీన్ పై సమంతను చూసిన చైతూ సంతోషంతో ఉప్పొంగిపోయాడు. సమంత సీన్ వస్తున్నంతసేపు అలాగే చూస్తూ ఉండిపోయాడు చైతూ. ఇందుకు సంబంధించిన వీడియోస్ నెట్టింట వైరలవుతుండగా.. సామ్ ను చూడగానే చైతూ రియాక్షన్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. కొన్నాళ్లుగా సామ్, చైతూ కలిస్తే చూడాలని చాలా మంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ క్రమంలో చాలాకాలం తర్వాత మనం సినిమా ద్వారా తన మాజీ భార్య సమంత సీన్స్ చూసి చైతూ ఎంజాయ్ చేసిన మూమెంట్స్ షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

నాగచైతన్య రియాక్షన్ వీడియో..

మనం సినిమాలో సమంత, నాగచైతన్య భార్యభర్తలుగా నటించిన సంగతి తెలిసిందే. ఏమాయ చేసావే సినిమాతో ఏర్పడిన వీరిద్దరి పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. 2017లో ఇద్దరి కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. కానీ పెళ్లైన నాలుగేళ్లకే 2021లో వీరిద్దరు విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. సామ్, చైతూ విడిపోవడం ఇప్పటికీ ఇండస్ట్రీలో షాకింగ్ న్యూస్. వీరిద్దరి విడిపోవడానికి కారణాలు ఇప్పటికీ తెలియరాలేదు. ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న సామ్.. ఇప్పుడు మా ఇంటి బంగారం మూవీలో నటిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.