AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naa Anveshana: అన్వేష్ మరో షాకింగ్ వీడియో.. బిగ్ బాస్ ఆది రెడ్డితో పాటు ఆ లేడీ యాంకర్ పై సంచలన ఆరోపణలు

ప్రపంచ యాత్రికుడు, నా అన్వేషన్ ఫేమ్ ఆటగాడు అన్వేష్ మళ్లీ వచ్చాడు. ఆ మధ్యన కొందరు ప్రభుత్వాధికారులపై సంచలన ఆరోపణలు చేసి పోలీస్ కేసుల వరకు వెళ్లిన అతను కాస్త గ్యాప్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు మరో సంచలన వీడియోతో మన ముందుకు వచ్చాడు.

Naa Anveshana: అన్వేష్ మరో షాకింగ్ వీడియో.. బిగ్ బాస్ ఆది రెడ్డితో పాటు ఆ లేడీ యాంకర్ పై సంచలన ఆరోపణలు
Adi Reddy, Anvesh
Basha Shek
|

Updated on: May 18, 2025 | 1:38 PM

Share

‘ఐపీఎల్ రీ స్టార్ట్ అయ్యింది కాబట్టి.. బెట్టింగ్ యాప్ ఉద్యమం కూడా ప్రారంభిస్తున్నా’ అంటూ మరో ఇద్దరి సెలబ్రిటీల భాగోతాన్ని బయటపెట్టాడు ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్. బెట్టింగ్ యాప్స్ పై ఓ పెద్ద యుద్ధమే చేస్తోన్న అతను వీటిని ప్రమోట్ చేస్తోన్న ఎంతో మంది యూట్యూబర్లు, సోషల్ మీడియా సెలబ్రిటీలు, ఇన్ ఫ్లూయెన్సర్ల బాగోతాలను బయట పెట్టాడు. అయితే ఒకానొక దశలో అన్వేష్ ఉద్యమం దారి తీప్పింది. సెలబ్రిటీలపై నోటికొచ్చినట్లు మాట్లాడాడు. బూతులతో రెచ్చిపోయాడు. ఇదేక్రమంలో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కొందరు అధికారులపై సంచలన ఆరోపణలు చేశాడు అన్వేష్. దీంతో అతనిపై పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో తన బెట్టింగ్ వీడియోలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు.అయితే ఇప్పుడు మళ్లీ సంచలన వీడియోను రిలీజ్ చేశాడు. ఇప్పుడు బెట్టింగ్ ఫ్యామిలీకి రాజు, రాణి వీళ్లే అంటూ ఇద్దరు బిగ్ బాస్ సెలబ్రిటీపై సంచలన ఆరోపణలు చేశాడు. అందులో మొదటగా ఆది రెడ్డి గురించి ఇలా చెప్పుకొచ్చాడు.’ ఆది రెడ్డికి రెండు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయ్. అందులో ఆయనది ఒకటి, మరొకటి ఆయన భార్యది . ఇంకా సోషల్ మీడియా ఖాతాలు ఉన్నాయి. బిగ్ బాస్‌ షోకి వెళ్లక ముందు ఆది రెడ్డి రివ్యూలు చెప్పాడు. ఆ తర్వాత నే బిగ్ బాస్ షోకి వెళ్లాడు. మళ్లీ వచ్చిన తర్వాత రివ్యూలు చెబుతున్నాడు. ఎటు చూసినా రెండు చేతులా ఆదాయమే. కాలు కదలకుండా కుర్చీలో కూర్చుని సంపాదిస్తున్నాడు. అయినా కూడా ఆన్ లైన్ లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు. అవసరమా ఆదిరెడ్డి నీకు’

ఇవి కూడా చదవండి

ఇతను బెట్టింగ్స్‌ యాప్స్‌ని ఏవిధంగా ప్రమోట్ చేసేవాడంటే.. ఇతను తన యూట్యూబ్ ఛానల్‌లో విశ్లేషణలు ఇచ్చేవాడు. అలాగే ఫాంటసీ టీమ్స్‌లో వచ్చే వీడియోలకి విత్ ఔట్ కేవైసీ డౌన్‌లోడ్ అని లింక్ ఇచ్చేవాడు. కానీ ఆ లింక్ లీగల్ కాదు. చట్ట విరుద్ధం. అతను ఫాంటా ఫీటా అనే బెట్టింగ్ యాప్‌ని ప్రమోట్ చేశాడు. ఇది ఆదిరెడ్డి ఛానలే అని చెప్పడానికి ఆధారం ఏంటంటే.. లైవ్‌లోకి వెళ్తే ఇతని వీడియోలో వస్తాయి. మొత్తం వీడియోలన్నీ ఆదిరెడ్డివే.  కోట్లు సంపాదిస్తున్న నువ్వు అమాయకుల్ని ఎలా మోసం చేయగలిగావ్ బ్రో. ఫాంటసీ యాప్‌లను ఆంధ్రా, తెలంగాణలో బ్యాన్ చేశారు. మరి నువ్వు బ్యాన్ చేసిన యాప్‌లను ఎందుకు ప్రమోట్ చేశావు. ఎవరి కోసం చేశావ్? నువ్వు కూడా పేదరికం నుంచే కదా వచ్చిందీ. వాళ్లనే ఎలా మోసం చేయాలనిపించింది. వీటి వల్ల ఎంతమంది చనిపోతున్నారో నీకు తెలియదా? సరే ఇప్పటివరకు అయ్యిందేదో అయిపోయింది.. ఇకపైన ఎప్పుడూ ఇలాంటివి చేయకు బ్రో’ అంటూ ఆదిరెడ్డి గురించి చెప్పుకొచ్చాడు అన్వేష్.

ఇటీవలే పోలీసులను కలిసిన ఆదిరెడ్డి..

కాగా ఆది రెడ్డితో పాటు ప్రస్తుతం టాలీవుడ్ లో ది టాప్ మోస్ట్ యాంకర్ పై కూడా సంచలన ఆరోపణలు చేశాడు అన్వేష్. మరి దీనిపై ఆదిరెడ్డి, ఆ లేడీ యాంకర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్