akkineni akhil: టాలీవుడ్‌లో మైత్రి మూవీస్ మేకర్స్ దూసుకుపోతున్నారు. ఓ వైపు వరుసగా సినిమాలు తీస్తూనే.. మరో వైపు హీరోలకు కూడా అడ్వాన్స్‌లు ఇస్తూ.. లాక్ చేస్తున్నారు. అయితే తాజాగా ఓ క్రేజీ హీరోను లాక్ చేశారట మైత్రీ వారు.అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున వారసుడిగా టాలీవుడ్‌లోకి దూసుకువచ్చిన మరో హీరో అక్కినేని అఖిల్. సిసింద్రీ సినిమాతో ఊహతెలియని వయసులోనే స్టార్ డమ్ను సంపాదించిన ఈ హీరోను.. మైత్రీ మూవీ మేకర్స్ లాక్ చేశారట. త్వరలో తమ బ్యానర్‌లో ఓ మూవీ చేసేందుకు ఇప్పుడే అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారట. ఇప్పుడిదే విషయం ఫిల్మ్‌నగర్‌లో జోరుగా వినిపిస్తోంది.
అఖిల్ ప్రస్తుతం “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సినిమాను విడుదల చేసే పనిలో బిజీగా ఉన్నారు. బొమ్మరిల్లు ఫేమ్ భాస్కర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా ఈ పాటికే రిలీజ్ కావాల్సుంది కాని.. కరోనా కారణంగా వాయిదా పడింది. కరోనా కూల్ అయిపోవడం.. థియేటర్లు ఓపెన్ అవుతుండడంతో ఈ సినిమాను రిలీజ్ చేసే పనిలో పడ్డారు అఖిల్. ఆలస్యం చేయకుండా ఆగస్టు ఫస్ట్ వీక్‌లో తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారట. ఇక ఇప్పటికే గోపీసుందర్ స్వరపరిచిన ఈ సినిమాలోని సాంగ్స్ అందర్నీ ఆకట్టుకుంటూ.. సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి.ఈ సినిమాతో పాటు అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో “ఏజెంట్” సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా కోసం అఖిల్ తన లుక్ ని మార్చుకొని, కొత్త గెటప్ లో కి ట్రాన్స్‌ఫాం అయ్యారు.
మరిన్ని ఇక్కడ చదవండి :