chiranjeevi: ‘ఖైదీ నెంబర్ 150’తో గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆ తర్వాత ‘సైరా నర్సింహ రెడ్డి’ సినిమా కోసం రెండేళ్ల గ్యాప్ ఇచ్చారు. ఇక అనంతరం ‘ఆచార్య’ సినిమాకు కరోనా కారణంగా రెండేళ్లు గ్యాచ్ వచ్చింది. దీంతో వరుసగా సినిమాలు విడుదల చేయాలని ఫిక్స్ అయిన చిరు ఏక కాలంలో పలు ప్రాజెక్టులను ట్రాక్ ఎక్కించారు. ప్రస్తుతం చిరు ఒకేసారి మూడు చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఒకటి. చిరంజీవి 154వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ‘వల్తేర్ వీరయ్య’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే చిత్ర యూనిట్ మాత్రం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఇదిలా ఉంటే తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించి బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. ఈ సినిమాను 2023 సంక్రాంతికానుకగా విడుదల చేయనున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. అలాగే అధికారికంగా సినిమా టైటిల్‌ను, టీజర్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. టాలీవుడ్‌కు కలిసొచ్చే సంక్రాంతి బరిలో దిగడానికే చిత్ర మైత్రీ మూవీ మేకర్స్ మొగ్గుచూపారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ 40 శాతం పూర్తయింది. తర్వాతి షెడ్యూల్‌ను వచ్చే నెలలో మొదలు పెట్టి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. చిరుకు జోడిగా శృతీ హాసన్ నటిస్తోన్న ఈ సినిమాను మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా విల్సన్ సినిమాటోగ్రఫీగా వ్యవహరిస్తున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..