Gunturu Karam: ‘ఈ సినిమానే టార్గెట్ చేస్తున్నారు.. ఎందుకో అర్థం కావడం లేదు’.. రూమర్స్ పై తమన్ అసహనం..

|

Jul 10, 2023 | 5:00 PM

గత కొద్ది రోజులుగా గుంటూరు కారం చిత్రం గురించి వస్తోన్న వార్తలు మరో సినిమా గురించి రాలేదు. ఈ మూవీ యూనిట్ విషయంలో అనేక మార్పులు జరుగుతుండడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ రూమర్స్ పై మాత్రం చిత్రయూనిట్ నుంచి ఎలాంటి క్లారిటీ రావడం లేదు.

Gunturu Karam: ఈ సినిమానే టార్గెట్ చేస్తున్నారు.. ఎందుకో అర్థం కావడం లేదు.. రూమర్స్ పై తమన్ అసహనం..
Thaman
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తోన్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2021లోనే ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటికీ గతేడాది ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యింది. కానీ ఈ సినిమా షూటింగ్ మాత్రం ఆలస్యంగా జరుగుతుంది. ఇప్పటికీ ఈ సినిమా దాదాపు 70 శాతం చిత్రీకరణ కంప్లీట్ చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ ఈ మూవీపై మరింత క్యూరియాసిటిని పెంచేశాయి. ఇందులో మహేష్ మరోసారి మాస్ లుక్ లో కనిపించనుండడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. కానీ నిత్యం ఈ సినిమా గురించి రూమర్స్ నెట్టింట వినిపిస్తుంటాయి. గత కొద్ది రోజులుగా గుంటూరు కారం చిత్రం గురించి వస్తోన్న వార్తలు మరో సినిమా గురించి రాలేదు. ఈ మూవీ యూనిట్ విషయంలో అనేక మార్పులు జరుగుతుండడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ రూమర్స్ పై మాత్రం చిత్రయూనిట్ నుంచి ఎలాంటి క్లారిటీ రావడం లేదు.

ముందుగా ఈ చిత్రంలో కథానాయికగా పూజా హెగ్డే నటిస్తుందని.. కీలకపాత్రలో శ్రీలీల నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే అనుకోకుండా పూజా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని.. దీంతో ఆమె స్థానంలోకి శ్రీలీల వచ్చిందని టాక్ నడిచింది. ఆ తర్వాత పూజా స్థానంలోకి మరో హీరోయిన్ మీనాక్షి చౌదరిని తీసుకున్నారట. ఇక ఇవే కాకుండా.. ఈసినిమా నుంచి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తప్పుకున్నాడంటూ వార్తలు హల్చల్ చేశాయి. గతంలోనే ఈ రూమర్స్ పై స్పందించారు తమన్. తన ట్విట్టర్ వేదికగా మజ్జిగ గ్లాస్ షేర్ చేస్తూ కడుపుమంటగా ఉంటే మజ్జిగ తాగాలంటూ పరొక్షంగా చురకలు వేశారు.

ఇక ఇప్పుడు నేరుగానే గుంటూరు కారం సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. సోమావారం మీడియా ప్రతినిధులతో తమన్ మాట్లాడుతూ.. “అందులో ఆ సినిమాపైనే పడ్డారు. ఎందుకో నాకు అర్థం కావడం లేదు. రెండేళ్లపాటు, నాలుగేళ్ల పాటు షూటింగ్ జరుపుకున్న.. జరుపుకుంటున్నా సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ వాటన్నింటిని వదిలేసి గుంటూరు కారం సినిమానే టార్గెట్ చేస్తున్నారు” అని అన్నారు. ఈ సినిమా కోసం అందరూ చాలానే కష్టపడుతున్నారని.. ఒక మంచి మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నామంటూ ధీమా వ్యక్తం చేశారు తమన్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.