AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RP Patnaik: ఆ పాటకు డ్యాన్స్ చేస్తూ ఒక అబ్బాయి చనిపోయాడు.. మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్..

చిత్రం విజయం తర్వాత ఆర్ పి పట్నాయక్ తన కెరీర్‌లో నో చెప్పడం నేర్చుకున్నారట. ఇది ఆయన విజయానికి కీలకమని వెల్లడించారు. దర్శకుడు తేజతో ఆయన పని విధానం, నువ్వు నేను పాటల పుట్టుక, కాలేజీ పాటలకు జానపద స్పర్శ ఇవ్వడం వెనుక ఉన్న తన వ్యక్తిగత అనుభవాలు పంచుకున్నారు. గాజువాక పిల్ల పాట గురించిన పాజిటివ్, విషాదకరమైన సంఘటనలను వివరించారు.

RP Patnaik: ఆ పాటకు డ్యాన్స్ చేస్తూ ఒక అబ్బాయి చనిపోయాడు.. మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్..
Rp Patnaik
Rajitha Chanti
|

Updated on: Aug 27, 2026 | 7:04 PM

Share

తెలుగు చిత్రసీమలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, పాటల వెనుక ఉన్న ఆసక్తికర కథనాలను పంచుకున్నారు. దర్శకుడు తేజ కాంబినేషన్‌లో వచ్చిన ‘చిత్రం’ సినిమా ఘనవిజయం సాధించిన తర్వాత తన జీవితంలో పెద్ద మార్పు వచ్చిందని పట్నాయక్ తెలిపారు. ఆ సినిమా తర్వాత దాదాపు 22 చిన్న సినిమాలకు ఆయన ‘నో’ చెప్పారు. క్వాలిటీ లేని కథలను తిరస్కరించడం వల్ల ఇండస్ట్రీలో కొందరు ఆయనను అహంకారి అని భావించినప్పటికీ, కేవలం మంచి మ్యూజిక్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆ నిర్ణయాలు తీసుకున్నానని ఆయన స్పష్టం చేశారు. అప్పటివరకు తెలుగు సినిమాల్లో కాలేజీ పాటలు అంటే కేవలం వెస్ట్రన్ శైలిలోనే ఉండేవి. అయితే ఆర్పీ పట్నాయక్ రియలిస్టిక్ అప్రోచ్‌తో ఫోక్ (జానపద) శైలిని జోడించారు. తాను చదువుకున్న రోజుల్లో ఎప్పుడూ బెంచ్ మీదే దరువు వేస్తూ పాటలు పాడేవారమని, అదే సహజత్వాన్ని సినిమాల్లోకి తెచ్చానని ఆయన చెప్పారు. ఆ ఆలోచన నుంచే ‘మామా చందమామ’, ‘గాజువాక పిల్ల’ వంటి ఐకానిక్ పాటలు పుట్టుకొచ్చాయి.

ఎక్కువ మంది చదివినవి : Cinema : 3 సీజన్స్.. 33 ఎపిసోడ్స్.. 6 సంవత్సరాలుగా ఓటీటీని శాసిస్తున్న సిరీస్.. ఇప్పటికీ తెగ డిమాండ్..

‘నువ్వు నేను’ సినిమా సమయానికి ఒకే సన్నివేశం కోసం ఆర్పీ పట్నాయక్ ఒక ట్యూన్, రచయిత కులశేఖర్ ఒక లిరిక్ సిద్ధం చేశారు. కులశేఖర్ రాసిన ‘గున్నమామిడి కొమ్మ మీద’ లిరిక్‌కు ఆర్పీ పట్నాయక్ ఒక ట్యూన్ చేశారు. అయితే వేరే పాటను ఫైనల్ చేయడంతో ఆ ట్యూన్ మిగిలిపోయింది. అదే ట్యూన్‌ను ఆ తర్వాత ‘జయం’ సినిమాలో “ఎవ్వరేమన్నా మారదు ఈ ప్రేమ” పాటగా మార్చి వాడుకోవడం విశేషం.

ఎక్కువ మంది చదివినవి :  Bigg Boss : నన్ను వాడుకుని వదిలేశాడు.. టార్చర్ చేశాడు.. అందుకే చచ్చిపోవాలనుకున్నా.. బిగ్ బాస్ బ్యూటీ..

‘గాజువాక పిల్ల’ పాట ఎంతగా పాపులర్ అయిందో చెబుతూ ఆర్పీ ఒక విషాదకర సంఘటనను పంచుకున్నారు. ఒక పెళ్లి పార్టీలో మద్యం మత్తులో ఉన్న పెళ్లికొడుకు సోదరుడు ఈ పాటను రాత్రంతా రిపీట్ మోడ్‌లో వేయించుకుని, అలసిపోయే వరకు డాన్స్ చేసి ప్రాణాలు విడిచారట. ఒక పాట పరిమితి దాటితే ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చివరగా, రామోజీరావు గారి నుంచి అందుకున్న 75 వేల రూపాయల మొదటి చెక్ ఇప్పటికీ తనకి ఒక సెంటిమెంట్ అని ఆర్పీ పట్నాయక్ సంతోషంగా గుర్తు చేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Jabardasth : రామోజీ ఫిల్మ్ సిటీలో హోటల్ ఇండస్ట్రీలో నాతో పనిచేశాడు.. ఇప్పుడు క్రేజీ హీరో.. జబర్దస్త్ నటుడు..

ఎక్కువ మంది చదివినవి : Tollywood: అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో పెద్ద నటుడు.. గవర్నమెంట్ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి ఎందుకు వచ్చారంటే..

Follow Us