Thammudu movie: తమ్ముడు చిత్రానికి 23 ఏళ్లు.. పవన్ కళ్యాణ్‏తో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న మ్యూజిక్ డైరెక్టర్..

|

Jul 16, 2022 | 1:07 PM

నా సంగీతం పట్ల ప్రేమను చూపించిన మీ అందరికి ధన్యవాదాలు. నేను పవన్ కళ్యాణ్‏తో కలిసి ఈ అద్భుతమైన చిత్రానికి సంగీతం అందించి 23 సంవత్సరాలు

Thammudu movie: తమ్ముడు చిత్రానికి 23 ఏళ్లు.. పవన్ కళ్యాణ్‏తో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న మ్యూజిక్ డైరెక్టర్..
Pawan Kalyan
Follow us on

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రధాన పాత్రలో డైరెక్టర్ అరుణ్ ప్రసాద్ తెరకెక్కించిన తమ్ముడు (Thammudu) సినిమా ఏ రెంజ్‏లో హిట్ అయ్యిందో తెలిసిన విషయమే. ఇందులో ప్రీతి జింగానియా కథానాయికగా నటించిన ఈ సినిమా 1999న జూలై 15న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచింది. బాక్సింగ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో పవన్ లోని కంప్లీట్ ఎనర్టీ కనిపిస్తుంది. నిన్నటి ఈ మూవీ విడుదలై 23 ఏళ్లు అయ్యింది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల ట్విట్టర్ వేదికగా ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు.

“నా సంగీతం పట్ల ప్రేమను చూపించిన మీ అందరికి ధన్యవాదాలు. నేను పవన్ కళ్యాణ్‏తో కలిసి ఈ అద్భుతమైన చిత్రానికి సంగీతం అందించి 23 సంవత్సరాలు అయ్యిందంటే నమ్మలేకపోతున్నాను ” అంటూ తమ్ముడు సినిమాలోని ఏదోలా ఉంది నాలో.. సాంగ్ పాడి వినిపించారు. మళ్లీ మళ్లీ మీ పాటలు కావాలి సర్, మళ్లీ సేనాని కళ్యాణ్ గారి సినిమాల్లో పాటలు చేయండి..మీ ఇద్దరి కాంబోలో ఎవర్ గ్రీన్ సాంగ్స్ వచ్చాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.