Mahit Narayan: అన్నయ్య భార్య మళ్లీ పెళ్లి చేసుకుంది.. మాకు సంబంధాల్లేవ్‌.. చక్రి సోదరుడి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్

|

Mar 31, 2023 | 3:31 PM

దివంగత సంగీత దర్శకుడు చక్రి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 2000 లో బాచి అనే చిన్న సినిమాతో మొదలైన ఆయన సంగీత ప్రయాణం ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, ఇడియట్‌, కబడ్డీ కబడ్డీ, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి, శివమణి, సత్యం, ఆంధ్రావాలా, దేవదాసు, దేశముదురు..

Mahit Narayan: అన్నయ్య భార్య మళ్లీ పెళ్లి చేసుకుంది.. మాకు సంబంధాల్లేవ్‌.. చక్రి సోదరుడి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్
Chakri's brother Mahith Narayan
Follow us on

దివంగత సంగీత దర్శకుడు చక్రి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 2000 లో బాచి అనే చిన్న సినిమాతో మొదలైన ఆయన సంగీత ప్రయాణం ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, ఇడియట్‌, కబడ్డీ కబడ్డీ, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి, శివమణి, సత్యం, ఆంధ్రావాలా, దేవదాసు, దేశముదురు, సింహా, గోలీమార్‌, డీ.. ఇలా ఎన్నో హిట్‌ సినిమాలకు తనదైన శైలిలో స్వరాలు సమకూర్చారు. తన మ్యూజిక్‌ ట్యాలెంట్‌కు గుర్తింపుగా ఫిల్మ్‌ఫేర్‌, నంది అవార్డులను కూడా సొంతం చేసుకున్నారాయన. సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన 2014లో గుండెపోటుతో హఠాత్తుగా కన్నుమూశారు. ఇది సంగీత అభిమానులను తీవ్రంగా కలచివేసింది. దీనికి తోడు చక్రి మరణం తర్వాత ఆయన కుటుంబంలో ఆస్తి పరమైన ఇబ్బందులు తలెత్తాయి. అది కాస్తా మీడియా వరకు రావడంతో రచ్చరచ్చగా మారింది. చాలా రోజలు వరకు చక్రి కుటుంబంలో ఆస్తిపరమైన తగాదాలు కొనసాగాయి. ఇదిలా ఉంటే చక్రి వారసత్వాన్ని నిలబెట్టేలా ఆయన సోదరుడు మహిత్‌ నారాయణ్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. పరారీ అనే సినిమాకు ఆయనే స్వరాలు సమకూర్చాడు. గురువారం (మార్చి30) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

పరారీ సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్న మహిత్‌ చక్రి గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘మ్యూజిక్ డైరెక్టర్ గా ఇప్పుడు నేను చేస్తున్న పనికి గురువు మా అన్నయ్య చక్రీనే. ఆయనతో పాటు ఉంటూ చెప్పిన పని చేస్తూ వెళ్లడం వలన, నాకు ఈ పని తెలిసింది. నేను అన్నయ్య వారసుడిగా సాగాలనేది ఆయన కోరికనే. అన్నయ్య మరణం తర్వాత నేను ఎలా జీవించగలను అని చాలాసార్లు అనిపించింది. అయితే ఆయన వారసుడిగా నిలబడాలనే అన్నయ్య కలను సాకారం చేయాల్సిన బాధ్యత నాపైనే ఉంది. అందువల్లనే అన్నిటినీ తట్టుకుని నిలబడ్డాను. ఆయన మరణం నాకు ఒక పాఠం నేర్పింది. మరింత మొండిగా బ్రతకడం నేర్చుకున్నాను’ అని చెప్పుకొచ్చాడు మహిత్‌. ఇక చక్రి ఆస్తుల వివాదంపై స్పందిస్తూ .. ‘ ‘ అన్నయ్య ఉన్నప్పుడు మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ ఆయన చనిపోయాక ఆస్తి గొడవలు తలెత్తాయి. ఓవైపు అన్నయ్య లేడనే బాధకి తోడు ఈ ఆస్తి తగాదాలతో ప్రతిరోజు నరకం అనుభవించాం. అన్నయ్య ఆస్తుల్లో కొన్నింటిని భార్య అమ్మేసుకొని అమెరికా వెళ్లిపోయింది. అక్కడే ఇంకో పెళ్లి చేసుకొని అక్కడే స్థిరపడింది. ఆమెతో మాకెలాంటి సంబంధాలు లేవు. మరికొన్ని ఆస్తులు కోర్టు కేసు పరిధిలో ఉన్నాయి’ అని చెప్పుకొచ్చాడు మహిత్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..