AR Rahman: మాస్టర్ ఆఫ్ మెలోడీ బర్త్ డే స్పెషల్.. ఏ.ఆర్. రెహమాన్ గురించి ఈ విషయాలు తెలుసా ?..

తొలి సినిమాతోనే ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా జాతీయ అవార్డ్ అందుకున్నారు. భారతీయ సినీ పరిశ్రమలో ఎవర్ గ్రీన్ హిట్ మూవీ 'రోజా'తో సంగీత దర్శకుడిగా ప్రయాణం స్టార్ట్ చేశారు ఎ.ఆర్. రెహమాన్. తొమ్మిదేళ్ల వయసులోనే తండ్రని కోల్పోయి..జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న కుర్రాడు.. ఇప్పుడు ఇండియన్ మూవీస్ మాస్టర్ ఆఫ్ మెలోడి. రెండు ఆస్కార్ అవార్డ్స్, రెండు గ్రామీ అవార్డ్స్, బీఎఎప్టీఎ అవార్డ్, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్, నాలుగు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, పదిహేను ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్..

AR Rahman: మాస్టర్ ఆఫ్ మెలోడీ బర్త్ డే స్పెషల్.. ఏ.ఆర్. రెహమాన్ గురించి ఈ విషయాలు తెలుసా ?..
Ar Rahman

Updated on: Jan 06, 2024 | 12:04 PM

ఏ.ఎస్ దిలీప్ కుమార్ అంటే అసలు ఎవరికీ పరిచయం లేని పేరు. కానీ ఎ.ఆర్ రెహమాన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఈ పేరు చెప్పగానే మనసును హత్తుకుని ప్రశాంతతను అందించే సంగీతం గుర్తొస్తోంది. భారతీయ సినీ పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన పాటలకు తన మ్యూజిక్‍తో ప్రాణం పోశాడు. రెహమాన్ సంగీతానికి ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది. తెలుగు, హిందీ, తమిళంలో ఎన్నో సినిమాలకు సంగీతం అందించి సంగీత ప్రియులను అలరించారు. తొలి సినిమాతోనే ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా జాతీయ అవార్డ్ అందుకున్నారు. భారతీయ సినీ పరిశ్రమలో ఎవర్ గ్రీన్ హిట్ మూవీ ‘రోజా’తో సంగీత దర్శకుడిగా ప్రయాణం స్టార్ట్ చేశారు ఎ.ఆర్. రెహమాన్. తొమ్మిదేళ్ల వయసులోనే తండ్రని కోల్పోయి..జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న కుర్రాడు.. ఇప్పుడు ఇండియన్ మూవీస్ మాస్టర్ ఆఫ్ మెలోడి. రెండు ఆస్కార్ అవార్డ్స్, రెండు గ్రామీ అవార్డ్స్, బీఎఎప్టీఎ అవార్డ్, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్, నాలుగు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, పదిహేను ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్.. పదమూడు ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డ్ ఇలా ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. ఈరోజు ఎ.ఆర్. రెహమాన్ పుట్టినరోజు. ఈ సందర్బంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు ఫ్యాన్స్.

1967 జనవరి 6న మద్రాసులో జన్మించాడు ఎ.ఆర్. రెహమాన్. ఆయన అసలు పేరు ఎ.ఎస్ దిలీప్ కుమార్. తండ్రి ఆర్.కె.శేఖర్, తల్లి కస్తూరి. తండ్రి శేఖర్ సంగీత దర్శకుడు. తమిళ, మలయాళీ సినిమాలకు ఫిల్మ్ స్కోర్ కంపోజర్ గా పనిచేశారు. రెహామన్ నాలుగు సంవత్సరాల వయస్సు నుంచి పియానో నేర్చుకోవడం ప్రారంభించాడు. స్టూడియోలలో తన తండ్రికి సహయం చేసేవాడు. తొమ్మిదేళ్ల వయసులో తండ్రి మరణించడంతో కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకున్నాడు. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో విద్యను మధ్యలో ముగించాడు. 11 ఏళ్ల వయసులోనే పియానో, కీబోర్డు ప్లేయర్ గా ఇళయరాజా, రమేశ్ నాయుడు, రాజ్ కోటిల వద్ద పనిచేశాడు. రెహమాన్ కుటుంబం 1989లో ఇస్లామ్ మతంలోకి మారింది. అప్పటి నుంచి దిలీప్ కుమార్ పేరు కాస్త రెహమాన్ గా మారింది.

రెహమాన్ మాస్టర్ ధనరాజ్ వద్ద సంగీత శిక్షణను ప్రారంభించాడు . కేవలం 11 సంవత్సరాల వయస్సులో తన తండ్రికి సన్నిహిత మిత్రుడు అయిన మలయాళ స్వరకర్త MK అర్జునన్ ఆర్కెస్ట్రాలో వాయించడం ప్రారంభించాడు. జాకీర్ హుస్సేన్, కున్నకుడి వైద్యనాథన్, ఎల్. శంకర్ వంటి దిగ్గజాలతో పనిచేశాడు. 1992లో రోజా సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించిన చాలా సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్. తెలుగు, తమిళం, హిందీలో ఎన్నో చిత్రాలకు పనిచేశాడు. 30 ఏళ్లకు పైగా సంగీత దర్శకుడిగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న రెహమాన్.. తన మొదటి సినిమా రోజా కోసం రూ.25,000 పారితోషికం తీసుకున్నాడు. ఇప్పుడు ఆయన ఆస్తి రూ.1748 కోట్లు. ఇప్పుడు ఒక్క సినిమాకు రూ. 8 నుంచి 10 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడు. అలాగే లైవ్ పర్ఫామెన్స్ కోసం రూ.1-2 కోట్లు వసూళు చేస్తాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.