AR Rahman: మళ్లీ కలవనున్న ఏఆర్ రెహమాన్, సైరా..? షాకింగ్ కామెంట్స్ చేసిన లాయర్..

ఇటీవల ఇండస్ట్రీలో విడాకులు సర్వసాధారణంగా మారిపోయాయి. ఒకట్రెండు సంవత్సరాలు కాదు.. దాదాపు 30 ఏళ్ల వైవాహిక బంధానికి సైతం ముగింపు పలుకుతున్నారు. ఈ మధ్య ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన టాపిక్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, సైరా భాను విడాకులు.

AR Rahman: మళ్లీ కలవనున్న ఏఆర్ రెహమాన్, సైరా..? షాకింగ్ కామెంట్స్ చేసిన లాయర్..
Ar Rahman ,saira Banu
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 29, 2024 | 8:59 PM

టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భాను విడాకుల ప్రకటన ఇండస్ట్రీలో తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దాదాపు 29 ఏళ్ల వివాహ బంధానికి వీరిద్దరి స్వస్తి చెప్పారు. ఇన్నాళ్లు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడిపోవడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. కానీ రెహమాన్, సైరా డివోర్స్ ప్రకటనను ఎంతో మంది ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. అయితే మరోవైపు సోషల్ మీడియాలో రెహామాన్ ఆస్తులు.. సైరాకు ఎన్ని కోట్ల భరణం ఇచ్చారు అనే చర్చ నడుస్తోంది. అయితే ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని దంపతులు తెలిపారు. దీని తర్వాత పిల్లల కస్టడీ ఎవరికి దక్కుతుందనే చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే తాజాగా వీరిద్దరి విడాకుల కేసు వాదిస్తున్న లాయర్ వందన షా కీలక వ్యాఖ్యలు చేశారు. రెహమాన్, సైరా మళ్లీ కలిసి ఛాన్స్ ఉందంటూ హింటిచ్చారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో వందన షా మాట్లాడుతూ.. “రెహమాన్, సైరా దంపతులకు ముగ్గురు పిల్లలు. వారందరూ ఎవరి వద్ద ఉండాలనే హక్కు పిల్లలకు ఉంది. . పిల్లల కస్టడీ ఇంకా నిర్ణయించలేదు. వీరిద్దరి మధ్య సయోధ్య కుదరదు అని నేను ఎప్పుడూ చెప్పలేదు. ఇద్దరిదీ సుధీర్ఘ వైవాహిక జీవితం.. ఎంతో ఆలోచించుకున్నాకే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు” అంటూ చెప్పుకొచ్చారు. లాయర్ వ్యాఖ్యల అనంతరం రెహామాన్, సైరా మళ్లీ కలిసి అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.

ఇదివరకు ఇండస్ట్రీలో విడాకులు తీసుకున్న అమీర్ ఖాన్, కిరణ్ రావు ఎప్పుడూ కలిసి కనిపిస్తారు. ఇద్దరూ స్నేహితులుగా ఎంతో సరదాగా ఉంటారు. అలాగే రెహమాన్, సైరా కూడా కనిపిస్తారా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రెహమాన్, సైరా 1995లో వివాహం చేసుకున్నారు.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.