Mufasa Telugu Trailer: ‘ముఫాసా’ తెలుగు ట్రైలర్ చూశారా..? మహేష్ డైలాగ్స్‏కు ఫిదా కావాల్సిందే..

ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ముఫాసా: ది లయన్ కింగ్ సినిమా పై మంచి బజ్ నెలకొంది. ఇందులో ఆరోన్ స్టోన్, కెల్విన్ హ్యారిసన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇదివరకే ఈ మూవీ పోస్టర్స్ రిలీజ్ చేశారు. అలాగే ఈ మూవీలో కీలకమైన ముఫాసా పాత్రకు సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ అందించారు.

Mufasa Telugu Trailer: ముఫాసా తెలుగు ట్రైలర్ చూశారా..? మహేష్ డైలాగ్స్‏కు ఫిదా కావాల్సిందే..
Mufasa, Mahesh Babu

Updated on: Aug 26, 2024 | 12:39 PM

వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ముఫాసా: ది లయన్ కింగ్. ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్నీ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఇది ఒకటి. ఇప్పటికే ది లయన్ కింగ్ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ముఫాసా: ది లయన్ కింగ్ సినిమా పై మంచి బజ్ నెలకొంది. ఇందులో ఆరోన్ స్టోన్, కెల్విన్ హ్యారిసన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇదివరకే ఈ మూవీ పోస్టర్స్ రిలీజ్ చేశారు. అలాగే ఈ మూవీలో కీలకమైన ముఫాసా పాత్రకు సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ అందించారు. ఈ విషయాన్ని గతంలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో మహేష్ డైలాగ్స్ ఫిదా చేస్తున్నాయి.

“అప్పుడప్పుడు ఈ చల్లని గాలి.. నా ఇంటి నుంచి వచ్చే జ్ఞాపకాలను గుర్తుచేస్తున్నట్లుగా అనిపిస్తుంది. కానీ అంతలోనే అవి మాయమవుతున్నాయి” అంటూ మహేష్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. అద్భుతమైన విజువల్స్, మహేష్ చెప్పే డైలాగులతో ఈ మూవీ ట్రైలర్ ఆద్యంత అలరించేలా సాగింది. ముఫాసాకు వాయిస్ అందించడంపై సంతోషం వ్యక్తం చేశారు మహేష్. “మనకు తెలిసిన.. ఇష్టపడే పాత్రకు ఇది కొత్త అంకం. తెలుగులో ముఫాసాకు వాయిస్ అందించడం చాలా సంతోషంగా ఉంది. ఈ క్లాసిక్ కు నేను విపరీతమైన అభిమానిని కావడంతో ఇది నాకు చాలా ప్రత్యేకంగా ఉంది” అని తెలిపారు. ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న రిలీజ్ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే ముఫాసా పాత్రకు హిందీలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ వాయిస్ అందించారు. అలాగే ముఫాసా చిన్నప్పటి పాత్రకు షారుఖ్ చిన్న కుమారుడు అబ్రం.. సింబా పాత్రకు షారుఖ్ పెద్ద కొడుకు ఆర్యన్ డబ్బింగ్ చెప్పడం విశేషం. 2019లో వచ్చిన ది లయన్ కింగ్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.