
స్టార్ హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ ఈ మధ్యన సినిమాల కంటే ఇతర విషయాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా లవ్, డేటింగ్ వార్తలతో తరచూ ట్రెండింగ్ అవుతోంది. గతంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో మృణాళ్ ప్రేమలో ఉందని పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఓ టాలీవుడ్ హీరోను ఈ బ్యూటీ పెళ్లి చేసుకోనుందంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడు టీమ్‌ఇండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ తో మృణాళ్ డేటింగ్ లో ఉందని పుకార్లు గుప్పుమన్నాయి. ఓ సినిమా ప్రమోషన్స్‌లో మాట్లాడిన ఆమె టీమిండియా క్రికెటర్ పై ప్రశంసల వర్షం కురిపించింది దీంతో ఆ ప్లేయర్ తో మృణాళ్ రిలేషన్ లో ఉన్నట్లు జాతీయ మీడియాలో నూ వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది మృణాళ్.
‘ఇలాంటి రూమర్స్ వినడానికి కూడా హాస్యాస్పదంగా ఉంటాయి. వాళ్లు ఏదో ఒకటి మాట్లాడుకుంటారు.. మేము నవ్వుకుంటాం. పుకార్లు అనేవి ఫ్రీ పీఆర్ లాంటివి. నాకు ఫ్రీగా వచ్చేవి అంటే చాలా ఇష్టం’ అని మృణాల్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది మృణాళ్ . ఆమె ఏ పుకారు గురించి మాట్లాడుతోందో స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ, ఇటీవల తన డేటింగ్ గురించి వస్తున్న వార్తలకు కౌంటర్ గానే గానే మృణాళ్ చెప్పిందని నెటిజన్లు భావిస్తున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. ‘సన్నాఫ్ సర్దార్ 2’తో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చింది మృణాల్. ప్రస్తుతం ఆమె. ‘దో దీవానే శహర్ మే’ తో సహా మరో రెండు హిందీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. తెలుగులో అడివి శేష్ సరసన నటిస్తున్న ‘డెకాయిట్’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.