Mrunal Thakur: ‘ప్రతీ ఇంట్లో శృంగారం, లస్ట్ గురించి ఓపెన్‌గా మాట్లాడుకోవాలి’..

|

Jul 01, 2023 | 7:21 PM

2018లో 'లస్ట్ స్టోరీస్' వెబ్ సిరీస్ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రధానంగా యూత్‌ను ఆకర్షించేందుకు తీసిన ఈ వెబ్‌సిరీస్‌కు..

Mrunal Thakur: ప్రతీ ఇంట్లో శృంగారం, లస్ట్ గురించి ఓపెన్‌గా మాట్లాడుకోవాలి..
Mrunal Thakur
Follow us on

2018లో ‘లస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీస్ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రధానంగా యూత్‌ను ఆకర్షించేందుకు తీసిన ఈ వెబ్‌సిరీస్‌కు కొనసాగింపుగా వచ్చింది ‘లస్ట్ స్టోరీస్ 2’. ఇందులో తమన్నా, మృణాల్ ఠాకూర్, కాజోల్ వంటి స్టార్ హీరోయిన్లు ప్రధాన పాత్రల్లో కనిపించారు. జూన్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ లస్ట్ స్టోరీస్ 2లో మృణాల్ ఠాకూర్ పలు రొమాంటిక్ సీన్లలో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో బోల్డ్ కామెంట్స్ చేసింది. అవి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

‘శృంగారం, లస్ట్ గురించి ప్రతీ ఇంట్లోనూ పరిణితితో ఓపెన్‌గా మాట్లాడుకోవడం చాలా ముఖ్యం. ఈ విషయాన్ని నేను బలంగా నమ్ముతాను. ముఖ్యంగా యువ్వనంలో ఉన్నవారికి ఇది అవసరం. ఇలాంటి విషయాలను యువతకు నిజాయితీగా వివరించే ఒక్కరైనా ఇంట్లో ఉండాలి. అప్పుడే బయట నుంచి వచ్చే తప్పుడు సమాచారంపై వారు ఆధారపడరు’ అని మృణాల్ చెప్పుకొచ్చింది. కాగా, ‘సీతారామం’ సినిమాతో పాన్ ఇండియా వైడ్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది మృణాల్ ఠాకూర్. ప్రస్తుతం ఈ బ్యూటీ నానితో ఒక సినిమా, విజయ్ దేవరకొండతో ఓ చిత్రం.. అలాగే తమిళంలో శివ కార్తికేయన్‌తో మరో చిత్రంలో నటిస్తోంది.