AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maa Election: మా ఎన్నికల కోసం నైట్‌ పార్టీలు.. గ్రూప్‌ మెసేజ్‌లు.. సభ్యులను ప్రసన్నం చేసుకునే పనిలో ప్రకాశ్‌రాజ్‌

Maa Election: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ 'మా' ఎన్నికల గురించి సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈసారి అధ్యక్ష పగ్గాలు ఎవరు అందుకోబోతున్నారన్నదానిపై ఆసక్తిగా ఎదురు..

Maa Election: మా ఎన్నికల కోసం నైట్‌ పార్టీలు.. గ్రూప్‌ మెసేజ్‌లు.. సభ్యులను ప్రసన్నం చేసుకునే పనిలో ప్రకాశ్‌రాజ్‌
Subhash Goud
|

Updated on: Aug 28, 2021 | 5:27 PM

Share

Maa Election: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికల గురించి సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈసారి అధ్యక్ష పగ్గాలు ఎవరు అందుకోబోతున్నారన్నదానిపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చాలా వివాదాలు తెరమీదకు వచ్చాయి. మా ఎన్నికల సందర్భంగా నైట్‌ పార్టీలు జోరుగా జరుగుతున్నాయి. ఆగస్టు 29న హీరో నాగార్జున జన్మదిన వేడుకలకు ఆహ్వానం అంటూ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్ల వాట్సాప్‌ గ్రూపుల్లో మేసేజ్‌లు జోరందుకున్నాయి. ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్‌ గ్రూపులో సమీర్‌ ఈ ఆహ్వాన మేసేజ్‌లు షేర్‌ చేశాడు. అలాగే ప్రకాష్ రాజ్ కార్యాలయంలో సెలెబ్రేషన్స్ అంటూ ఆహ్వానాలు అందుతున్నాయి. ప్రకాశ్‌ రాజ్‌ ఎన్నికల సందర్భంగా మా సభ్యులను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నాడు. తేదీ ఖరారు కావడంతో ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కుతోంది. ఎవరికి వారు మా సభ్యులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అంతేకాదు మా ఎన్నికల సందర్భంగా నైట్‌ పార్టీలు కూడా జోరందుకుంటున్నాయి. ఎన్నికలు నిర్వహించేందుకు ఇంకా నెలకుపైగా సమయం ఉన్నా.. ప్రచారం మాత్రం జోరందుకుంటోంది. ఇక బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ గ్రూపుల్లో ఈ మెసేజ్‌లు జోరందుకుంటున్నాయి.

కాగా, తెలుగు సినీ పరిశ్రమ మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల తేదీ ఖరారైన విషయం తెలిసిందే. అక్టోబరు 10న ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఇక అధ్యక్ష అభ్యర్థులు, వారి ప్యానెల్‌ సభ్యులు ప్రచారం ముమ్మరం చేయనున్నారు. మరి చివరి వరకూ ఎవరు పోటీలో ఉంటారు? ఎవరు విజయం సాధిస్తారు? అన్నదానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం అధ్యక్ష బరిలో ప్రకాష్‌రాజ్‌, మంచు విష్ణు, సీవీఎల్‌ నరసింహారావు, జీవితా రాజశేఖర్‌ హేమలు ఉన్నారు. చివరి నిమిషంలో ఎవరైనా బరిలోకి దిగుతారా? లేక ఎవరినైనా ఏకగ్రీవం చేస్తారా? అన్నది ఉత్కంఠగా మారింది. మరోవైపు నటీనటుల సమస్యల పరిష్కారంతో పాటు, ‘మా’ నూతన భవనం ప్రధాన అజెండాగా ఈసారి ఎన్నికలు జరగనున్నాయి.

Messages

ఇటీవల ఆన్‌లైన్‌ వేదికగా ‘మా’ సర్వసభ్య సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. మా కార్యవర్గ ఎన్నికల నిర్వహణ అంశంపై ఈ సందర్భంగా ప్రధానంగా చర్చ జరిగింది. క్రమశిక్షణ కమిటీ ఎలా చెబితే అలా చేస్తామని ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు నరేష్‌ కూడా తన అభిప్రాయాన్ని ప్రకటించారు. ‘మా’ నిబంధనల ప్రకారం 21 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని సినీ నటుడు, ‘మా’ అధ్యక్ష అభ్యర్థి ప్రకాష్‌రాజ్‌ సూచించారు. అంటే సెప్టెంబరు 12వ తేదీన నిర్వహించాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడానికి సన్నద్ధత అవసరమని అందుకు సమయం కావాలని క్రమశిక్షణ కమిటీ అభిప్రాయపడింది. సెప్టెంబరు రెండో వారం నుంచి అక్టోబరు రెండో వారం మధ్యలో ఏ తేదీ అనువుగా ఉంటే అప్పుడు నిర్వహిస్తామని తెలిపింది. ఇందులో భాగంగా అక్టోబరు 10వ తేదీన ఎన్నికలు నిర్వహించాలని ‘మా’ క్రమశిక్షణ కమిటీ నిర్ణయానికి వచ్చింది.

ఇవీ కూడా చదవండి:

Most Eligible Bachelor: బ్యాచిలర్‌ రాకకు తొలగిన అడ్డంకులు.. అధికారికంగా విడుదల తేదీ ప్రకటన. ఎప్పుడంటే.

Pushpa Update: పుష్పరాజ్‌ను ఢీకొట్టబోయేది ఎవరో తెలుసా.? ‘విలన్‌ ఆఫ్‌ పుష్ప’ను పరిచయం చేసిన చిత్ర యూనిట్‌.