
గతేడాది ప్రయాగ్ రాజ్ కుంభమేళా లో పూసలమ్ముతూ ఒక్కసారిగా వైరల్ అయిపోయింది మోనాలిసా భోంస్లే. మధ్యప్రదేశ్ కు చెందిన ఆమె తన తేనె కళ్లతో అందరి దృష్టిని ఆకర్షించింది. మోనాలిసా క్రేజ్ ను చూసి చాలా మంది దర్శక నిర్మాతలు ఆమెతో సినిమా చేసేందుకు ముందుకొచ్చారు. కానీ అందరికీ షాక్ ఇస్తూ మోనాలిసా భోంస్లే ఇటీవల కేరళలో వివాహం చేసుకుంది. తన కుటుంబ సభ్యుల ఇష్టానికి విరుద్ధంగా ఫర్మాన్ ఖాన్ అనే ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకుంది. కేరళకు చెందిన కొంతమంది రాజకీయ నాయకులు దగ్గరుండి మరీ వీరి వివాహం జరిపించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతోంది. కొందరు మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ వివాహాన్ని ‘లవ్ జిహాద్’ అని కూడా పిలుస్తున్నారు. కానీ నూతన వధూవరులు దీనిని ఖండించారు. తమకు అన్ని మతాలు సమానమేనన్నారు. ఇదిలా ఉంటే మోనాలిసా ప్రేమ వివాహంపై ఆమె తండ్రి జయసింగ్ భోంస్లే స్పందించారు.
కొన్ని రోజుల క్రితం, కొంతమంది మోనాలిసా ఇంటికి వచ్చారని, నటన లో శిక్షణ, సినిమా పనుల కోసం మోనాలిసాను తమ తో పాటు కేరళకు పంపమని జయ్ సింగ్ ను అడిగారు. ఇలాంటి విషయాల గురించి పెద్దగా తెలియని జయసింగ్ భోంస్లే అంగీకరించడమే కాకుండా, మోనాలిసాతో కలిసి కేరళకు కూడా వెళ్లాడు. మోనాలిసా ఇప్పుడు వివాహం చేసుకున్న భర్త ఫర్మాన్ ఖాన్ కూడా ఇంటికి వచ్చిన బృందంలో ఉన్నాడు.
“మోనాలిసా- ఫర్మాన్ ఖాన్ లు పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు, నేను అభ్యంతరం చెప్పి మా సొంతూరుకు తిరిగి రమ్మని అడిగాను. కానీ వారు కేరళ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రక్షణ కోరారు. మోనాలిసాకు ఇప్పటికే 18 సంవత్సరాలు కాబట్టి, ఆమె తనకు నచ్చిన వారిని వివాహం చేసుకోవచ్చని పోలీసులు చెప్పారు. దీంతో మేం ఏమీ చేయలేకపోయారు’ అని జయసింగ్ చెప్పుకొచ్చారు.
‘కొంతమంది సినిమా అవకాశం కోసం నా కూతురిని కేరళకు పిలిపించుకున్నారు. మేము పెద్దగా చదువుకున్న వాళ్ళం కాదు. ఇదంతా ఎలా జరిగిందో మాకు అర్థం కావడం లేదు. బహుశా ఎవరైనా నా బిడ్డను ప్రభావితం చేసి ఉండవచ్చు. ఆమె నిర్ణయాన్ని అంగీకరించడం తప్ప మాకు ఇప్పుడు వేరే మార్గం లేదు. మాకు ముందే చెప్పి ఉంటే, మేమే పెళ్లి చేసేవాళ్లం’ అని మోనాలిసా మామ తెలిపాడు.
#Monalisa Bhonsle, who became an overnight internet sensation during the #MahaKumbhMela, #Prayagraj, Married her Boyfriend Farman in #Kerala
Before Marriage #MonalisaBhonsle approached the police in #Thiruvananthapuram (or #Trivandrum) on Wednesday seeking protection to stay… pic.twitter.com/LHH5qLVjhq
— Surya Reddy (@jsuryareddy) March 11, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.