Son of India Trailer: ప్రపంచంలో ఏ పోరాటమైనా ఒక్కడితోనే ప్రారంభమవుతుంది.. సన్నాఫ్ ఇండియా ట్రైలర్

డైలాగ్ కింగ్ మోహన్ బాబు కొంతకాలం గ్యాప్ తరవాత తిరిగి వెండితెరపై అలరించడానికి సిద్ధం అవుతున్నారు. మొన్నామధ్య సూర్య నటించి ఆకాశం నీ హద్దురా..! సినిమాలో చిన్న పాత్రలో కనిపించారు మోహన్ బాబు

Son of India Trailer:  ప్రపంచంలో ఏ పోరాటమైనా ఒక్కడితోనే ప్రారంభమవుతుంది.. సన్నాఫ్ ఇండియా ట్రైలర్
Son Of India

Updated on: Feb 11, 2022 | 7:54 AM

Son of India: డైలాగ్ కింగ్ మోహన్ బాబు(Mohan Babu )కొంతకాలం గ్యాప్ తరవాత తిరిగి వెండితెరపై అలరించడానికి సిద్ధం అవుతున్నారు. మొన్నామధ్య సూర్య నటించి ఆకాశం నీ హద్దురా..! సినిమాలో చిన్న పాత్రలో కనిపించారు మోహన్ బాబు. దాదాపు 7 సంవత్సరాల  తర్వాత  ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమాలో హీరోగా కనిపించనున్నారు మోహన్ బాబు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్,  టీజర్లు అభిమానులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో  విడుదలైన  గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ సినిమాకు డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు.  శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్‌ సంస్థలు సహకారంతో నటుడు మంచు విష్ణు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంగీత దిగ్గజం మ్యాస్ట్రో ఇళయరాజా స్వరాలు సమకూరుస్తున్నారు.

తాజాగా ఈ సినిమానుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో మోహన్ బాబు మరోసారి డైనమిక్ పాత్రలో కనిపించనున్నారని అర్ధమవుతుంది. దేశంను పట్టి పీడిస్తున్న సమస్యలపై పోరాటం చేసే పాత్రలో కనిపించబోతున్నారు మోహన్ బాబు. ప్రపంచంలో ఏ పోరాటమైనా ఒక్కడితోనే ప్రారంభమవుతుంది. ప్రపంచం అంతా నా కుటుంబం ప్రపంచం బాధే నా బాధ.ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే నేను దాన్నే ఫాలో అవుతున్నాను. అంటూ మోహన్ బాబు చెప్పే డైలాగ్స్ తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. డబ్బున్నోడికి ఓ న్యాయం డబ్బులేనోడికి ఓ న్యాయం… పవర్ ఉన్నోడికి ఓ న్యాయం పవర్ లేనోడికి ఓ న్యాయం.. డెమోక్రసీలో లా ఒకొక్కడికి ఒక్కోలా ఉండటం ఎందుకు.అయ్యోధ్య లో శ్రీరామ అని రాసిన ప్రతి ఇటుక మీద ప్రమాణం చేసి చెబుతున్నాను ఈ సొసైటీ లో ఉన్న క్రిమనల్స్ ఏరిపారేయాలి  అంటూ మోహన్ బాబు చెప్పే డైలాగులు చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Avika Gor: చీరకట్టులో సోయగాలు వలక పోస్తున్న చిన్నారి పెళ్లి కూతురు లేటెస్ట్ ఫోటోస్ వైరల్

Bhanu Shree: లంగా ఓణీలో తన అందాలు చూపిస్తూ ఫాన్స్‌ను మైమరిపిస్తున్న భాను శ్రీ లేటెస్ట్ ఇమేజెస్

Unstoppable NBK: బాలయ్య తనపై వచ్చే మీమ్స్‌ చూసి ఏమనుకుంటారు.? నెట్టింట వైరల్‌ అవుతోన్న ‘ఆహా’ వీడియో..