Srikanth Bharath: గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్..
జాతి పిత మహాత్మా గాంధీ పై సోషల్ మీడియాలో అనుచిత, అసభ్యకర వ్యాఖ్యల చేసిన నటుడు శ్రీకాంత్ భరత్ పై చర్యలు తీసుకోవాలని బషీర్ బాగ్ సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన టీపీసీసీ ఉపాధ్యక్షులు, ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూర్ వెంకట్. ఇటీవల శ్రీకాంత్ భరత్ వరుస వీడియోస్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
దేశ స్వాతంత్ర్య సమరంలో పోరాటం చేసి.. అహింసా సిద్ధాంతంలో దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన గాంధీపై టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ భరత్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా నటుడు శ్రీకాంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గాంధీ మహాత్ముడా ? జాతిపితనా ? అంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో ఆయన తీరుపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నటుడు శ్రీకాంత్ భరత్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఆయనపై టీపీసీసీ ఉపాధ్యక్షులు, ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూర్ వెంకట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు బంజారాహిల్స్ లోనూ శ్రీకాంత్ భరత్ పై కేసు నమోదైంది.
హిట్ కొట్టాల్సిందే.. లేదంటే అంతే సంగతులు వీడియో
యముడికే మస్కా కొట్టిన ఒకే ఒక్కడు వీడియో
సైబర్ మోసం.. ఇలా చేస్తే డబ్బు వాపస్ వీడియో
సాగర తీరాన 'బీచ్ ఫెస్టివల్'కు వేళాయె వీడియో
బాబోయ్ చలి..మరో మూడు రోజులు గజగజ వీడియో
భయానకం.. ఆ అనుభవం,రైలు టాయిలెట్లో లాక్ చేసుకున్న మహిళ వీడియో
ప్రమాదంలో స్కై డైవర్ విమానం తోకను చుట్టిన పారాచూట్ వీడియో

