Kandikonda: స్వగ్రామం నాగుర్లపల్లిలోనేడు కందికొండ అంత్యక్రియలు.. బంధువుల కోరిక మేరకు చివరి నిమిషంలో మార్పు

Kandikonda passed Away: క్యాన్సర్(cancer) బారినపడి మృతి చెందిన ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి (Kandikonda Yadagiri) అంత్యక్రియలు ఈరోజు హైదరాబాద్ (hyderabad)లోని మహాప్రస్థానంలో

Kandikonda: స్వగ్రామం నాగుర్లపల్లిలోనేడు కందికొండ అంత్యక్రియలు.. బంధువుల కోరిక మేరకు చివరి నిమిషంలో మార్పు
Kandikonda Yadagiri

Updated on: Mar 13, 2022 | 1:05 PM

Kandikonda passed Away: క్యాన్సర్(cancer) బారినపడి మృతి చెందిన ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి(Kandikonda Yadagiri) అంత్యక్రియలు నేడు సొంత గ్రామం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నాగుర్లపల్లి లో జరగనున్నాయి. వాస్తవానికి ఆయన అంత్యక్రియను ఈరోజు హైదరాబాద్(hyderabad)లోని మహాప్రస్థానంలో  చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అభిమానుల సందర్శనార్ధం.. ఉదయం మోతి నగర్ లోని కందికొండ నివాసం నుండి పాతిక దేహాన్ని ఫిలిం నగర్ ఫిలిం ఛాంబర్ కి తరలించారు.  అయితే కందికొండ బంధువులు  కోరిక మేరకు చివరి నిమిషంలో ఆయన అంత్యక్రియలను సొంత ఊరులో నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆయన పార్ధీవ శరీరాన్ని స్వగ్రామానికి తీసుకుని వెళ్తున్నారు.

తెలంగాణ సినీ ఆటోగ్రాఫీ మంత్రి తలసాని కందికొండ యాదగిరి మరణించడం చాలా బాధాకరమని అన్నారు.  తెలుగు చలన చిత్ర పరిశ్రమలో గొప్ప పాటలు రాశారని..  తెలంగాణ సమాజం, ఉద్యమం కోసం రాసిన పాటల్లో ఆయన ఎప్పుడూ అందరికీ గుర్తుంటారని చెప్పారు. కందికొండ కుటుంబానికి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. ఆయన మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటని అన్నారు. కందికొండ కుటుంబాన్ని  ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీనిచ్చారు.

చిత్రపురి కాలనీ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ కందికొండ యాదగిరి మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంతేకాదు గతంలో రచయిత కందికొండకి చిత్రపురి కాలనీ లో కేటాయించిన ఫ్లాట్ ని వాళ్ళు వద్దనుకున్నారు. అయితే మరల తర్వాత కావాలని అడిగారు. ఇప్పుడు వారి కుటుంబ సభ్యులకు డబుల్ బెడ్రూం ఫ్లాట్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని అనిల్ కుమార్ హామీనిచ్చారు.

Also Read:

హైందవ సనాతన ధర్మాన్ని నిలబెట్టిన చిత్రం అఖండ.. చలన చిత్ర పరిశ్రమకు దిక్సూచి అన్న బాలయ్య

Tamilnadu: పొలంలో విషం తిని 12 నెమళ్ళు మృతి.. రైతుని అరెస్ట్ చేసిన పోలీసులు