AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mehreen Pirzada: కాబోయే వాడితో దిగిన అంద‌మైన ఫొటోను షేర్ చేసిన మెహ‌రీన్‌.. ఈ బంధాన్ని ఆ దేవుడు ఎప్పటికీ..

Mehreen Pirzada: క‌రోనా సంక్షోభ స‌మ‌యంలో చాలా మంది సెల‌బ్రిటీలు ఓ ఇంటివారు అయ్యారు. గ‌తేడాది లాక్‌డౌన్ కార‌ణంగా అనుకోకుండా ల‌భించిన ఖాళీ స‌మ‌యంలో వివాహాలు చేసుకున్నారు. వీరిలో...

Mehreen Pirzada: కాబోయే వాడితో దిగిన అంద‌మైన ఫొటోను షేర్ చేసిన మెహ‌రీన్‌.. ఈ బంధాన్ని ఆ దేవుడు ఎప్పటికీ..
Mehareen
Narender Vaitla
|

Updated on: Apr 25, 2021 | 1:03 PM

Share

Mehreen Pirzada: క‌రోనా సంక్షోభ స‌మ‌యంలో చాలా మంది సెల‌బ్రిటీలు ఓ ఇంటివారు అయ్యారు. గ‌తేడాది లాక్‌డౌన్ కార‌ణంగా అనుకోకుండా ల‌భించిన ఖాళీ స‌మ‌యంలో వివాహాలు చేసుకున్నారు. వీరిలో రానా, నిఖిల్‌, నితిన్‌.. ఇలా హీరోల జాబితానే ఎక్కువ ఉంది. అయితే ఈ క‌రోనా స‌మ‌యంలోనే అందాల తార మెహ‌రీన్ ఫిర్జాదా కూడా వివాహం చేసుకోనుంది. గ‌తేడాది లాక్‌డౌన్ స‌మయంలో ప‌రిచ‌య‌మైన భ‌వ్య బిష్ణోయ్‌ని త్వ‌ర‌లోనే మ‌నువాడ‌నుందీ బ్యూటీ. భ‌వ్య బిష్ణోయ్.. హ‌ర్యానా మాజీ ముఖ్య మంత్రి భ‌జ‌న్‌లాల్ బిష్ణోయ్ మ‌న‌వ‌డు అనే విష‌యం తెలిసిందే. భ‌వ్య‌.. ప్ర‌స్తుతం కాంగ్రెస్ యువ నేత‌గా రాణిస్తున్నారు. ఇదిలా ఉంటే వీరిద్ద‌రి మ‌ధ్య ఏర్ప‌డ్డ స్నేహం ప్రేమ‌గా మారి పెద్ద‌లను ఒప్పించి పెళ్లి వ‌ర‌కు తీసుకొచ్చిందీ జంట‌. ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్న ఈ క‌పుల్ త్వ‌ర‌లోనే ఏడ‌డుగులు వేయ‌నున్నారు. పెళ్లి ముహుర్తం త‌గ్గ‌ర‌ప‌డుతోన్న నేప‌థ్యంలో ఈ జంట ప్రీ వెడ్డింగ్ షూట్‌తో బిజీగా గ‌డుపుతోంది. తాజాగా మెహ‌రీన్ త‌న‌కు కాబోయే వాడితో క‌లిసి దిగిన ఓ అంద‌మైన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా అభిమానుల‌తో పంచుకుంది. ఒక‌రి క‌ళ్ల‌లోకి ఒక‌రు చూసుకుంటూ.. చేతులు ప‌ట్టుకున్న స‌మ‌యంలో తీసిన ఫొటోను పోస్ట్ చేస్తూ.. ‘ఈ బంధాన్ని ఆ దేవుడు ఎప్పుడూ ఇలాగే ఆశీర్వ‌దీస్తాడ‌ని ఆశిస్తున్నాన‌ను’ అని అర్థం వ‌చ్చేలా క్యాప్ష‌న్ జోడించిందీ బ్యూటీ.

మెహరీన్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌..

View this post on Instagram

A post shared by MEHREEN ?? (@mehreenpirzadaa)

ఇక మెహ‌రీన్ కెరీర్ విష‌యానికొస్తే.. ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’తో వెండితెర‌కు ప‌రిచ‌య‌మైన ఈ బ్యూటీ అన‌తికాలంలోనే వ‌రుస ఆఫ‌ర్లు ద‌క్కించుకున్నారు. ఎఫ్‌2లో హ‌నీ పాత్ర‌లో న‌వ్వులు పూయించిన ఈ చిన్న‌ది.. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా తెర‌కెక్కుతోన్న ఎఫ్‌3లో న‌టిస్తోంది. మ‌రి వివాహం త‌ర్వాత మెహ‌రీన్ సినిమాలు కొన‌సాగిస్తుందా లేదా.. అన్నది చూడాలి.

Also Read: Family Man Season-2: త్వరలో ప్రేక్షకుల ముందుకుఫ్యామిలీ మెన్ సీజన్ 2.. రిలీజ్ ఎప్పుడంటే..

Mass Maharaj Ravi Teja: మరో యంగ్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మాస్ మహా రాజ్

Shruti Haasan: ప్రభాస్ అలా ఉంటారని నేను అస్సలు అనుకోలేందంటున్న శృతిహాసన్..