Sai Dharam Tej: మా ఇంట్లో రెండు పండగలంటున్న మెగా ఫ్యామిలీ.. బ్యాచ్‌లర్‌గా లాస్ట్ బర్త్ డే అంటూ.. సాయి ధరమ్‌కు విశేష్ చెప్పిన మెగా కజిన్స్..

|

Oct 15, 2021 | 9:27 PM

Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ దాదాపు 35 రోజులు తర్వాత ఈరోజు ఉదయం ఇంటికి చేరుకున్నాడు. వినాయక చవితి రోజున హైదరాబాద్‌ కేబుల్..

Sai Dharam Tej: మా ఇంట్లో రెండు పండగలంటున్న మెగా ఫ్యామిలీ.. బ్యాచ్‌లర్‌గా లాస్ట్ బర్త్ డే అంటూ.. సాయి ధరమ్‌కు విశేష్ చెప్పిన మెగా కజిన్స్..
Sai Dharam Tej
Follow us on

Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ దాదాపు 35 రోజులు తర్వాత ఈరోజు ఉదయం ఇంటికి చేరుకున్నాడు. వినాయక చవితి రోజున హైదరాబాద్‌ కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదానికి గురైన సాయి ధరమ్ తేజ్ ఇప్పటి వరకూ  అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందారు. సాయి ధరమ్ రేజ్ పుట్టిన రోజు నేడు.. ఇక మరోవైపు ఈరోజు ఉదయం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నాడు. దీంతో మెగా ఫ్యామిలీ దసరా సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇక మెగా హీరో చిరంజీవి తన మేనల్లుడు రాకతో.. హర్షం వ్యక్తం చేస్తూ..  ఈరోజు మా ఇంట్లో విజయదశమి మాత్రమే కాదు.. మరో ప్రత్యేకమైన విశేషం ఉంది. యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడిన సాయితేజ్‌ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ఇంటికి వచ్చేశాడు. ఇది తనకి పునర్జన్మ వంటింది. మా కుటుంబం మొత్తానికి ఎంతో ఆనందంగా ఉంది. హ్యాపీ బర్త్‌డే సాయి తేజ్‌ అని ట్వీట్ చేశారు చిరంజీవి.

తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తిరిగి ఇంటికి వచ్చాడని.. మెగా అభిమాను ప్రార్ధనలు ఫలించాయని జనసేన పార్టీ తరపున ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. గ‌త నెల రోజులుగా చికిత్స పొందిన సాయి ధ‌ర‌మ్ తేజ్ కోలుకొని ఈ రోజు క్షేమంగా ఇంటికి చేరాడు. విజ‌య‌ద‌శ‌మి రోజున తేజు తిరిగి ఇంటికి రావడం ఎంతో సంతోషాన్ని క‌లిగించిందంటూ.. తేజు కు పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలియజేశాడు పవన్ కళ్యాణ్. అంతేకాదు తేజు యాక్సిడెంట్ గురించి తెలిసినప్పటి నుంచి అభిమానులు ఎన్నో పూజలు చేశారు.. వారు చేసిన ప్రార్ధనలు ఫలించి.. ఈరోజు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చాడు.    ప్ర‌తి ఒక్క‌రికి హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు పవన్ కళ్యాణ్ తెలియజేశారు.

ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలను చెప్పాడు. అంతేకాదు నీతో కలిసి డ్యాన్స్ వేయడానికి నేను వెయిట్ చేస్తున్నాను అని ట్వీట్ చేశారు.

మెగా డాటర్ సుస్మిత తేజు కి పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలిపింది. తన పుట్టిన రోజున ఇంటికి చేరుకున్న బర్త్ డే బేబీ బాయ్ అంటూ సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అందరికీ దసరా శుభాకాంక్షలు చెప్పింది.

 

Also Read:  చెంబులో మూగజీవి తల.. పిల్లి అనుకుని సాయం చేయబోయిన వైఎస్సార్ టీపీ లీడర్.. ఆపై పరుగో పరుగు..