తెలుగు చిత్ర పరిశ్రమలో పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి తెలిసిందే. ఆయన సినిమాలంటే విపరీతమైన ఇష్టమున్నవారు ఎందరో ఉన్నారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు పవన్ అభిమానులే. తన స్టైల్, ఆటిట్యూడ్ అంటే అభిమానులు పడిచస్తారు. మెగా ఫ్యామిలీ నుంచి.. చిరు తమ్ముడిగా చిత్రపరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన పవన్ తనకంటూ ప్రత్యేక క్రేజ్ సొంతం చేసుకున్నారు. పవన్ సినిమాల కోసం చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక పవన్ సినిమా వస్తుందంటే చాలు..సంబరాలు అంబరాన్నంటుతాయి. థియేటర్లలో, నెట్టింట్లో ఆయన అభిమానులు చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అటు అన్నయ్యకు తమ్ముడిగా నిలిచారు. ఇక చిరు, పవన్ కలిసి ఒకే ఫ్రేములో కనిపిస్తే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. చిత్రపరిశ్రమలో మరే హీరోకు అందనంత క్రేజ్.. ఫాలోయింగ్ ఒక్క పవన్‌కు మాత్రమే దక్కింది అనడంలో సందేహం లేదు. పవన్ పుట్టిన రోజు అంటే ఊరూరా పండగ జరుపుకుంటారు అభిమానులు. ఎక్కడ చూసిన పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ ఫ్యాన్స్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు.
ఇదిలా ఉంటే… ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. ఇప్పటికే అభిమానులు సంబరాలు మొదలు పెట్టారు. సోషల్ మీడియాలో మొత్తం పవన్ మేనియా కొనసాగుతుంది. అటు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి పవర్ స్టార్‌కు విషెష్ వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ఖాతా ద్వారా కళ్యాణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. చిన్నప్పటి నుంచి సమాజం గురించే కళ్యాణ్ ప్రతి ఆలోచన… ప్రతి అడుగు. పదిమందికి మేలు జరగాలని ప్రతి క్షణం పరితపించే నిప్పు కణం…కళ్యాణ్.. అతని లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తోడబుట్టిన ఆశయానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి..
ట్వీట్..
చిన్నప్పటి నుంచి సమాజం గురించే కళ్యాణ్ ప్రతి ఆలోచన… ప్రతి అడుగు. పదిమందికి మేలు జరగాలని ప్రతి క్షణం పరితపించే నిప్పు కణం…కళ్యాణ్ @PawanKalyan
అతని లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తోడబుట్టిన ఆశయానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. pic.twitter.com/PWAbNmvpAu— Chiranjeevi Konidela (@KChiruTweets) September 2, 2021