Megastar Chiranjeevi: మరో రీమేక్ పై మనసుపడిన చిరంజీవి.. మలయాళీ సూపర్ హిట్ కోసం మెగాస్టార్ సిద్దం..

|

Oct 08, 2022 | 9:04 AM

పొలిటికల్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార, సత్యదేవ్, సల్మాన్ ఖాన్ కీలకపాత్రలలో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబడుతూ దూసుకుపోతుంది. అయితే.. ఇప్పుడు ఈ మూవీ హిట్ తర్వాత చిరు మరో హిట్ చిత్రంపై మనసు పడినట్లు తెలుస్తోంది.

Megastar Chiranjeevi: మరో రీమేక్ పై మనసుపడిన చిరంజీవి.. మలయాళీ సూపర్ హిట్ కోసం మెగాస్టార్ సిద్దం..
Megastar Chiranjeevi
Follow us on

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆచార్య డిజాస్టర్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన గాడ్ ఫాదర్ మూవీ మొదటి రోజే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మలయాళీ సూపర్ హిట్ లూసీఫర్ రీమేక్‏గా వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. పొలిటికల్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార, సత్యదేవ్, సల్మాన్ ఖాన్ కీలకపాత్రలలో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబడుతూ దూసుకుపోతుంది. అయితే.. ఇప్పుడు ఈ మూవీ హిట్ తర్వాత చిరు మరో హిట్ చిత్రంపై మనసు పడినట్లు తెలుస్తోంది.

లేటేస్ట్ సమాచారం ప్రకారం చిరు మరో మలయాళీ సూపర్ హిట్ భీష్మ పర్వ చిత్రాన్ని రీమేక్ చేయాలని భావిస్తున్నారట. మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది. అయితే ఈ సినిమా రిమేక్ హాక్కులను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సొంతం చేసుకున్నారని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుందట.

ఇవి కూడా చదవండి

ఇక గాడ్ ఫాదర్ కాకుండా.. చిరు.. భోళా శంకర్, వాల్తేరు వీరయ్య చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. భోళా శంకర్ చిత్రంలో తమన్నా కథానాయికగా నటిస్తుండగా.. కీర్తి సురేష్ చిరు చెల్లిగా కనిపించనుంది. ఇక డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న వాల్తేరు వీరయ్య మూవీలో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా.. మాస్ మాహారాజా రవితేజ అతిథి పాత్రలో కనిపించనున్నారు.