Megastar Chiranjeevi: ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది.. తారకరత్న ఆరోగ్యం పై మెగాస్టార్ ట్వీట్

ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పైనే ఉన్నారు. ఇప్పటికే  రెండు హెల్త్‌ బులెటిన్‌లు విడుదల చేశారు నారాయణ హృదయాలయ వైద్యులు.

Megastar Chiranjeevi: ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది.. తారకరత్న ఆరోగ్యం పై మెగాస్టార్ ట్వీట్
Chiranjeevi, Taraka Ratna

Updated on: Feb 13, 2023 | 11:21 AM

నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది..  తారకరత్న ఆరోగ్యపరిస్థితి క్రిటికల్‌గా ఉందని వైద్యులు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పైనే ఉన్నారు. ఇప్పటికే  రెండు హెల్త్‌ బులెటిన్‌లు విడుదల చేశారు నారాయణ హృదయాలయ వైద్యులు. మొన్న మెదడుకు సంభందించిన సిటి స్కానింగ్ చేశారు. ఇంకా రిపోర్టు వివరాలు వెల్లడించలేదు వైద్యులు. ప్రతిక్షణం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు తారకరత్న. డాక్టర్ దేవి శెట్టి ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటున్నారు వైద్యులు. అయితే  తారక రత్నకి ఎక్మో అమర్చలేదని స్పష్టం చేశారు డాక్టర్లు. ఇక తారకరత్న త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు ప్రార్ధనలు చేస్తున్నారు.

సినిమా తారలు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తూ.. సోషల్ మీడియా వేదికగా పోస్ట్లు పెడుతున్నారు. ఇప్పటికే కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ బెంగుళూరుకు వెళ్లి తారకరత్న ఆరోగ్యపరిస్థితి తెలుసుకున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ షేర్ చేశారు.

“సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు,ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది.  తను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ, ఈ పరిస్థితి నుండి కాపాడిన ఆ డాక్టర్లకి ఆ భగవంతుడికి కృతజ్ఞతలు” అంటూ చిరు ట్వీట్ చేశారు.