AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naveen Chandra: పైరసీ బ్యాక్ డ్రాప్‌ నవీన్ చంద్ర నయా మూవీ.. మాయగాడిగా మారిన వర్సటైల్ యాక్టర్

ఒక వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు విలన్ పాత్రల్లోనూ.. సహాయక పాత్రల్లోనూ మెప్పిస్తున్నాడు.నేను లోకల్, దేవదాస్, అరవింద సమేత మూవీస్‌లో నవీన్ చేసిన ఇంపార్టెంట్ రోల్స్ ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాడు.

Naveen Chandra: పైరసీ బ్యాక్ డ్రాప్‌ నవీన్ చంద్ర నయా మూవీ.. మాయగాడిగా మారిన వర్సటైల్ యాక్టర్
Naveen Chandra
Rajeev Rayala
|

Updated on: Jan 31, 2023 | 9:57 AM

Share

అందాల రాక్షసి సినిమాతో హీరోగా పరిచయమైన నవీన్ చంద్ర.. ఆ తర్వాత హీరోగా పలు సినిమాల్లో మెప్పించాడు. ఒక వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు విలన్ పాత్రల్లోనూ.. సహాయక పాత్రల్లోనూ మెప్పిస్తున్నాడు. నేను లోకల్, దేవదాస్, అరవింద సమేత మూవీస్‌లో నవీన్ చేసిన ఇంపార్టెంట్ రోల్స్ ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాడు. ఇక ఇటీవలే వీరసింహరెడ్డి సినిమాలో కీలక పాత్రను పోషించి మంచి హిట్ అందుకున్నడు. ఈ క్రమంలోనే తాజాగా హీరోగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో గాయత్రీ సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. నేను లేని నా ప్రేమకథ, జమ్నా ప్యార్, కళా విప్లవం, ప్రణయం వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ గాయత్రీ సురేష్.

ప్రస్తుతం నవీన్ చంద్ర, గాయత్రీ సురేష్, పూజా జవేరి హీరో, హీరోయిన్స్‌గా, అడ్డా ఫేం.. జీ.ఎస్. కార్తీక్ రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా‘మాయగాడు’. స్వాతి పిక్చర్స్ బ్యానర్‌పై, భార్గవ్ మన్నె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసారు చిత్రబృందం. పైరసీ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న లవ్ స్టోరీ ఇది. ఈ సినిమాలో హీరో కొత్త సినిమాలను పైరసీ చేస్తుంటాడు. పైరసీ వలన సినీ పరిశ్రమకు ఏర్పడే నష్టాలను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను త్వరలో రిలీజ్ చేయనున్నారు.

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!