Waltair Veerayya: మెగా 154 అప్డేట్ వచ్చేసింది.. ఊరమాస్ గెటప్ లో అదరగొట్టిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కు పూనకాలే

|

Oct 24, 2022 | 11:28 AM

'ఇలాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ ధమాకాలు ఇంకా చూడాలనకుంటే ప్లీజ్‌ లైక్‌, షేర్‌ అండ్‌ సబ్‌ స్ర్కైబ్‌ అంటూ చిరంజీవి చెప్పిన డైలాగ్‌ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది.  దీనికి డీఎప్సీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోడు కావడంతో టైటిల్ టీజర్ సూపర్ హిట్ అని అంటున్నారు ఫ్యాన్స్.

Waltair Veerayya: మెగా 154 అప్డేట్ వచ్చేసింది.. ఊరమాస్ గెటప్ లో  అదరగొట్టిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కు పూనకాలే
Megastar Chiranjeevi
Follow us on

గాడ్‌ఫాదర్‌ సినిమాతో బాక్సాఫీస్‌ వద్ద మరో భారీ హిట్‌ సొంతం చేసుకున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. తర్వాతి ప్రాజెక్టుగా డైరెక్టర్‌ కే.ఎస్‌.రవీంద్ర దర్శకత్వంలో నటించనున్నారు. శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో మాస్‌ మహారాజా ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.మెగా154 (వర్కింగ్‌ టైటిల్‌) పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్‌, టీజర్లు ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించాయి. ఇప్పుడీ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ మరో కీలక అప్డేట్‌ ఇచ్చారు మూవీ మేకర్స్‌. దీపావళి కానుకగా టైటిల్ టీజర్ రీలీజ్‌ను విడుదల చేశారు.  ఇందులో లుంగీ కట్టుకుని, ఉంగరాలు, కడియం, చెవి పోగుతో బీడి తాగుతూ ఊరమాస్‌ గెటప్‌లో దర్శనమిచ్చారు మెగాస్టార్. ‘ఇలాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ ధమాకాలు ఇంకా చూడాలనకుంటే ప్లీజ్‌ లైక్‌, షేర్‌ అండ్‌ సబ్‌ స్ర్కైబ్‌ అంటూ చిరంజీవి చెప్పిన డైలాగ్‌ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది.  దీనికి డీఎప్సీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోడు కావడంతో టైటిల్ టీజర్ సూపర్ హిట్ అని అంటున్నారు ఫ్యాన్స్.  ప్రస్తుతం మెగా 154 అప్డేట్‌ నెట్టింట్లో బాగా ట్రెండ్‌ అవుతోంది.

ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌, యెర్నేనీ రవిశంకర్‌, మోహన్‌ నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. చాలాకాలం తర్వాత మెగాస్టార్‌తో మళ్లీ జత కలవనున్నాడు రాక్‌స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌. కాగా టైటిల్ టీజరే ఏఈ రేంజ్ లో  ఉంటే రేపు రాబోతున్న టైటిల్‌ టీజర్‌ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించడం ఖాయమంటున్నారు. కాగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌, యెర్నేనీ రవిశంకర్‌, మోహన్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి