Megastar Chiranjeevi: విమానంలో మెగాస్టార్ చిరంజీవి పెళ్లి రోజు వేడుకలు.. ఆ హీరో మిస్సింగ్..

మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అందులో చిరు దంపతులతోపాటు హీరో అక్కినేని నాగార్జున, అమల, మిగతా బంధువులు, స్నేహితులు సైతం కనిపిస్తున్నారు. ఇంతకీ చిరు, నాగార్జున ఫ్యామిలీ ఎందుకు కలిశారో తెలుసా.. ?

Megastar Chiranjeevi: విమానంలో మెగాస్టార్ చిరంజీవి పెళ్లి రోజు వేడుకలు.. ఆ హీరో మిస్సింగ్..
Megastar Chiranjeevi

Updated on: Feb 20, 2025 | 7:58 PM

మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతుల వివాహ వార్షికోత్సవం నేడు. ఈ సందర్భంగా తమ పెళ్లి రోజును విమానంలో ఘనంగా జరుపుకున్నారు. ఫ్లైట్ లో దుబాయ్ వెళ్తూ పెళ్లి రోజును ఇలా సెలబ్రేట్ చేసుకున్నారు. వీరితోపాటు అక్కినేని నాగార్జున, నమ్రత శిరోద్కర్, అమల తదితరులు చిరు రోజు వేడుకలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. చిరంజీవి దంపతులకు పుష్పగుఛ్చాలు ఇచ్చి విషెస్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను చిరు తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడంతో వైరలవుతున్నాయి. అయితే ఈ ఫోటోలలో నమ్రత కనిపిస్తుండగా.. మహేష్ బాబు మాత్రం కనిపించడం లేదు. దీంతో మహేష్ రాజమౌళి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

“దుబాయ్ మార్గమధ్యంలో కొంతమంది ప్రియమైన స్నేహితులతో విమానంలో మా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నాం. సురేఖ నా కలల జీవిత భాగస్వామి. ఆమెలాంటి సతీమణి దొరకడం నేను చాలా అదృష్టవంతుడిని అని భావిస్తున్నాను.. ఆమె నా బలం. ఆమె ఉనికి నిరంతరం నాకు ఓదార్పునిస్తుంది. అద్భుతమైన ప్రేరణనిస్తుంది. ఆమె నా మోటివేటర్. థాంక్యూ సోల్ మేట్. మీ అద్భుతమైన శుభాకాంక్షల కోసం స్నేహితులు, అభిమానులు, కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు. ఆశీర్వదించండి. ” అంటూ చిరు తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు. దీంతో చిరంజీవి, సురేఖ దంపతులకు అభిమానులు, సెలబ్రెటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బింబిసార వంటి సూపర్ హిట్ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుంది. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి.

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన