కరోనాతో చితికిన సినీ కార్మిక కుటుంబాలకు ఏదైనా చేయాలన్నదే తన అభిమతమన్నారు నటుడు చిరంజీవి. తెలుగు సినీ పరిశ్రమలో అన్ని విభాగాల సభ్యుల కుటుంబాలకు యోధా డయాగ్నిస్టిక్స్ ల్యాబుల్లో టెస్టులు, చికిత్సకు 50% రాయితీ ఇవ్వనున్నట్లు చెప్పారు. తన కోరిక మేరకు వెంటనే అంగీకరించిన యోధా డయాగ్నస్టిక్ యాజమాన్యానికి చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. 50% రాయితీతో సినీ కార్మికులకు హెల్త్ కార్డులను అందించడం ఆనందంగా ఉందన్నారు చిరంజీవి.
ఇండస్టీ పెద్దగా చిరంజీవి ఉండాలి అన్న కొందరు వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో మెగాస్టార్ స్పందించారు. “పెద్దగా ఉండను.. ఉండలేను.. కావాల్సినప్పుడు అండగా నిలబడగా.. అవసరమైనప్పుడు ఆదుకుంటా..” అంటూ తన మనసులోని మాటను క్లియర్‌గా చెప్పేశారు. ఆ పదవి తనకొద్దని.. పంచాయితీ చేసే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. ఇండస్ట్రీ పెద్ద అని అనిపించుకోవడం తనకు ఇష్టం లేదన్నారు మెగాస్టార్.. ఇద్దరు కొట్టుకుంటుంటే అలాంటి పంచాయితీలకు తాను ముందుకు రానని స్పష్టం చేశారు. కానీ, సినిమా కార్మికులకు ఏ సమస్య వచ్చినా తాను ముందుంటానని.. వాళ్లకోసం ఏదొకటి చేస్తూనే ఉంటానని వెల్లడించారు.
దాసరి నారాయణరావు చనిపోయిన తర్వాత.. ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అంటూ ఎవరూ లేరు. ఈ క్రమంలోనే చిరంజీవిని ఆ బాధ్యతలు తీసుకోవాలని కోరగా.. సున్నితంగా సమాధానమిచ్చారు.
Also Read: సంచలనం.. ‘ప్లాస్టిక్ బిడ్డ’కి జన్మనిచ్చిన మహిళ.. ఇండియాలోనే