Chiranjeevi: భోళాశంకర్‌లో చిరంజీవి ఎవర్‌ గ్రీన్‌ క్లాసిక్‌ హిట్ సాంగ్‌ రీమిక్స్‌!! ఇక మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే

దాదాపు సగం షూటింగ్‌ పూర్తి చేసుకున్న భోళాశంకర్‌ ఏప్రిల్‌ రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ సినిమాకు సంబంధించి సోషల్‌ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్‌ చక్కర్లు కొడుతోంది.

Chiranjeevi: భోళాశంకర్‌లో చిరంజీవి ఎవర్‌ గ్రీన్‌ క్లాసిక్‌ హిట్ సాంగ్‌ రీమిక్స్‌!! ఇక మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే
Chirnajeevi, Tamannah

Updated on: Feb 18, 2023 | 11:37 AM

‘వాల్తేరు వీరయ్య’ ఇచ్చిన విజయంతో ఫుల్‌ జోష్‌లో ఉన్నారు మెగాస్టార్‌ చిరంజీవి. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఇప్పుడీ విజయాన్ని కొనసాగిస్తూ త్వరలోనే భోళా శంకరుడిగా మన ముందుకు రానున్నారు మెగాస్టార్‌. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా కనిపించనుంది. చిరంజీవి చెల్లెలిగా మహానటి కీర్తి సురేశ్‌ సందడి చేయనుంది. ఇప్పటికే దాదాపు సగం షూటింగ్‌ పూర్తి చేసుకున్న భోళాశంకర్‌ ఏప్రిల్‌ రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ సినిమాకు సంబంధించి సోషల్‌ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్‌ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. చిరంజీవి నటించిన సూపర్‌ హిట్ సినిమా చూడాలని ఉందిలోని రామ్మా చిలుకమ్మ పాటను భోళాశంకర్‌లో రీమిక్స్‌ చేయనున్నారట. చిరంజీవి కెరీర్‌లో ఆల్ టైం క్లాసిక్ హిట్‌ సాంగ్‌గా ఈ పాటకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సినిమా విడుదలైనప్పుడు ఈ సాంగ్‌ మెగా ఫ్యాన్స్‌ను ఒక ఊపు ఊపింది. ఇప్పుడీ సాంగ్‌ను రీమిక్స్‌ చేయనున్నారని వార్త బయటకు రావడంతో మెగా ఫ్యాన్స్‌ తెగ సంబరపడిపోతున్నారు.

కాగా చూడాలని ఉంది సినిమాకు మణిశర్మ స్వరాలు సమకూర్చగా, భోళాశంకర్‌ సినిమాకు మణి కుమారుడు మహతి స్వర సాగర్‌ బాణీలు సమకూరుస్తుండడం విశేషం. ఇక చూడాలని ఉంది మూవీ కూడా కోల్‌కతా బ్యాక్ డ్రాప్‌లో నడుస్తుంది. ఇప్పుడు మెహర్ రమేశ్‌ సినిమా కూడా కోల్ కతా నేపథ్యంలోనే తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇలా అన్ని అంశాలు సింక్‌ అవుతుండడంతో రామ్మా చిలకమ్మా పాటను ఇందులో రీమిక్స్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై చిత్రబృందం ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇక భోళాశంకర్‌ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోనే జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఏకే ఎంటర్టైన్‌మెంట్స్‌, కె ఎస్ రామారావు క్రియేటివ్ కమర్షియల్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో వెన్నెల కిశోర్‌, అర్జున్‌ దాస్‌, రష్మీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇవి కూడా చదవండి


మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..