Chiranjeevi: రంగమార్తాండపై మెగాస్టార్‌ చిరంజీవి రివ్యూ.. సినిమా చూసి కంటతడి పెట్టుకున్నానంటూ..

|

Mar 25, 2023 | 12:40 PM

ప్రకాశ్‌ రాజ్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటించిన చిత్రం రంగ మార్తాండ. మరాఠీలో సూపర్‌ హిట్‌ అయిన నట సామ్రాట్‌కు రీమేక్‌గా ఇది తెరకెక్కింది. క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ చాలా రోజుల తర్వాత మరోసారి మెగా ఫోన్‌ పట్టుకుని ఈ అద్భుతమైన కావ్య దృశ్యాన్ని తెరకెక్కించారు.

Chiranjeevi: రంగమార్తాండపై మెగాస్టార్‌ చిరంజీవి రివ్యూ.. సినిమా చూసి కంటతడి పెట్టుకున్నానంటూ..
Megastar Chiranjeevi
Follow us on

ప్రకాశ్‌ రాజ్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటించిన చిత్రం రంగ మార్తాండ. మరాఠీలో సూపర్‌ హిట్‌ అయిన నట సామ్రాట్‌కు రీమేక్‌గా ఇది తెరకెక్కింది. క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ చాలా రోజుల తర్వాత మరోసారి మెగా ఫోన్‌ పట్టుకుని ఈ అద్భుతమైన కావ్య దృశ్యాన్ని తెరకెక్కించారు. ప్రీమియర్‌షోస్‌తోనే పాజిటివ్‌ రివ్యూస్‌ అందుకున్న రంగమార్తాండ 22న థియేటర్లలోకి అడుగుపెట్టింది. సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి రంగమార్తాండను వీక్షించారు. అనంతరం సినిమాపై తన అభిప్రాయాలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘రంగమార్తాండ సినిమా చూశాను. ఇటీవలి కాలంలో వచ్చినవాటిలో ఓ ఉత్తమ చిత్రమిది. ప్రతి ఆర్టిస్ట్‌కు తన జీవితాన్ని కళ్ల ముందు చూస్తున్నట్టనిపిస్తుంది. అలాగే ఈ చిత్రం ఓ త్రివేణి సంగమంలా అనిపించింది. కృష్ణవంశీలాంటి ఒక క్రియేటివ్‌ డైరెక్టర్‌, ప్రకాశ్‌ రాజ్‌ లాంటి జాతీయ ఉత్తమ నటుడు, హాస్య బ్రహ్మానందంల కలయిక, వారి పనితనం, ముఖ్యంగా ఆ ఇద్దరి అద్భుత నటుల నటన ఎంతో భావోద్వేగానికి గురి చేసింది’

‘బ్రహ్మానందం ఇంత ఇంటెన్సిటీ ఉన్న ఓ అనూహ్య పాత్రను చేయడం ఇదే తొలిసారి. సెకండ్‌ హాఫ్‌ మొత్తం అప్రయత్నంగానే కంటతడి నిండింది. ఓ కంప్లీట్‌ ఎమోషనల్‌ జర్నీ అయిన ఇలాంటి చిత్రాలు అందరూ చూసి ఆదరించాలి. ఇలాంటి రసవత్తరమైన చిత్రం తీసిన కృష్ణవంశీకి, ప్రకాశ్‌ రాజ్‌కు, రమ్యకృష్ణకు చిత్రయూనిట్‌ అందరికీ అభినందనలు’ అని ట్వీట్‌ చేశారు చిరంజీవి. కంప్లీట్‌ ఎమోషనల్‌ జర్నీగా తెరకెక్కిన రంగమార్తాండలో శివానీ రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, అనసూయ భరద్వాజ్, ఆదర్శ్‌ బాలకృష్ణ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. మ్యాస్ట్రో ఇళయరాజా స్వరాలు సమకూర్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..