Megastar Chiranjeevi: అందుకే అన్నయ్య అందరివాడు.. ప్రత్యేకంగా అతడిపై ప్రశంసలు కురిపించిన చిరంజీవి..

|

Nov 23, 2022 | 9:53 AM

ఇక మెగాస్టార్ వీరాభిమాని బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెట్ లోకి మంగళవారం ప్రత్యేక అతిథి విచ్చేసిన సంగతి తెలిసిందే. . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన హరిహర వీరమల్లు చిత్ర దర్శకుడు క్రిష్, నిర్మాత ఏఎమ్ రత్నంతో కలిసి హైదరాబాద్ లోని సెట్స్‌ను సందర్శించారు.

Megastar Chiranjeevi: అందుకే అన్నయ్య అందరివాడు.. ప్రత్యేకంగా అతడిపై ప్రశంసలు కురిపించిన చిరంజీవి..
Megastar
Follow us on

రీఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో వెండితెరపై సందడి చేస్తున్నారు. ఇటీవల గాడ్ ఫాదర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న చిరు చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీస్ కోసం మెగా అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుతం విడుదలకు అత్యంత వేగంగా సిద్ధమవుతున్న చిత్రం వాల్తేరు వీరయ్య. కొద్దిరోజులుగా ఈ సినిమా అప్డేట్స్ వరుసగా రివీల్ చేస్తున్న ఫ్యాన్స్ ను ఖుషి చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్ అంచనాలు పెంచేసింది. ఇక మెగాస్టార్ వీరాభిమాని బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెట్ లోకి మంగళవారం ప్రత్యేక అతిథి విచ్చేసిన సంగతి తెలిసిందే. . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన హరిహర వీరమల్లు చిత్ర దర్శకుడు క్రిష్, నిర్మాత ఏఎమ్ రత్నంతో కలిసి హైదరాబాద్ లోని సెట్స్‌ను సందర్శించారు. బాస్ పార్టీ పాటను చూసి ఆనందించారు పవన్ కళ్యాణ్. దర్శకుడు బాబీ కొల్లి ఈ మెగా మూమెంట్ పై గొప్ప సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక తాజాగా ఈ సాంగ్ కోసం పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ పై ప్రశంసలు కురిపించారు చిరు.

బాస్ పార్టీ సాంగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తన ఎక్జయిట్మెంట్ ను షేరు చేసుకున్న చిరు.. పాట కోసం వేసి సెట్స్, లొకేషన్ షూటింగ్ స్టిల్స్ షేర్ చేశారు. బాస్ పార్టీ రేపు మీ అందరి ముందుకొస్తున్న నేపథ్యంలో నేను ప్రత్యేకించి చెప్పాల్సింది ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ చేసిన ప్రొడక్షన్ డిజైన్. ఈ పాటకు చేసిన సెట్ వర్క్ మమ్మల్ని అందరి నీ ఆకట్టుకుంది. మీ ప్రశంసలు అతనికి దక్కుతాయని ఆశిస్తూ రెడీగా ఉండండి..రేపు పార్టీ షూరూ అవుతుంది అంటూ ట్వీట్ చేశారు చిరు.

ఇవి కూడా చదవండి

బాస్ పార్టీలో చిరంజీవి సరసన ఊర్వశి రౌతేలా సందడి చేయబోతుంది. నకాష్ అజీజ్, హరిప్రియతో కలిసి డీఎస్పీ పాడిన ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. డీఎస్పీ పాటకు సాహిత్యం కూడా రాశారు. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.