Megastar Chiranjeevi: నెరెసిన గడ్డంతో చిరు.. నయా లుక్ వెనుక సీక్రెట్ ఏంటి..?

|

Jul 12, 2021 | 2:00 PM

మెగాస్టార్ చిరంజీవి కొత్త గెటప్‌లో కనిపిస్తున్నారు. ఆచార్య షూటింగ్ పూర్తి కాకుండానే మెగా లుక్‌ మారిపోయింది. నెరిసిన గెడ్డం రొమన్‌ హెయిర్‌ స్టైల్‌తో కాస్త సాల్డ్ అండ్‌ పెప్పర్...

Megastar Chiranjeevi: నెరెసిన గడ్డంతో చిరు.. నయా లుక్ వెనుక సీక్రెట్ ఏంటి..?
Megastar New Look
Follow us on

మెగాస్టార్ చిరంజీవి కొత్త గెటప్‌లో కనిపిస్తున్నారు. ఆచార్య షూటింగ్ పూర్తి కాకుండానే మెగా లుక్‌ మారిపోయింది. నెరిసిన గడ్డం రొమన్‌ హెయిర్‌ స్టైల్‌తో కాస్త సాల్డ్ అండ్‌ పెప్పర్ టచ్‌ ఇచ్చారు కొత్త గెటప్‌లో.. ఈ నయా లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చినా.. ఆచార్య షూటింగ్ విషయంలోనే కన్ఫ్యూజన్ మొదలైంది. షూటింగ్ పెండింగ్ ఉండగానే చిరు లుక్కు మార్చేయటం వెనుక రీజన్‌ వెతికే పనిలో ఉన్నారు ఫ్యాన్స్‌. ఫైనల్‌గా ఆచార్య షూటింగ్ రీస్టార్ట్ అయ్యింది. రామ్ చరణ్ మీద కీ సీన్స్‌ తీస్తున్నారు కెప్టెన్‌ కొరటాల. రియల్‌ హీరో సోనూ సూద్‌ కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. కానీ మెగాస్టార్ మాత్రం మిస్సింగ్‌. అస్సలు ఆచార్య లుక్‌లోనే లేరు చిరు. దీంతో చిరు పోర్షన్‌ షూటింగ్ పూర్తయ్యిందన్న కంక్లూజన్‌కు వచ్చేశారు ఫ్యాన్స్.

అంతేకాదు మెగాస్టార్ నయా లుక్‌ విషయంలోనూ ఫ్యాన్స్‌ ఓ ఐడియాకు వచ్చేశారు. ఆచార్య తరువాత లూసీఫర్ రీమేక్‌లో నటించేందుకు రెడీ అవుతున్నారు మెగాస్టార్‌. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసమే చిరు నయా లుక్‌ ట్రై చేస్తున్నారన్నది ఇండస్ట్రీ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట. అయితే లూసీఫర్ ఒరిజినల్‌లో మోహన్‌ లాల్ బియర్డ్ లుక్‌లో కనిపించినా… వైట్ బియర్ట్ మాత్రం కాదు. మరి చిరు ఎందుకు తెల్ల గడ్డంతో కనిపిస్తున్నారు. అంటే ఇది లూసీఫర్ లుక్ కాదా…? లూసీఫర్‌తో పాటు ఆల్రెడీ వేదాలం రీమేక్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మెగాస్టార్‌. ఆ సినిమా ఒరిజినల్‌లో అజిత్‌ కొన్ని సీన్స్‌లో తెల్ల గడ్డంతో కనిపిస్తారు.

ఈ రెండు సినిమాలో చిరు నయా లుక్‌ ఏ సినిమా కోసం.. లూసీఫర్‌ కంటెంట్‌కు ఎలాగూ మార్పులు చేస్తున్నారు కాబట్టి.. లుక్‌ కూడా కంప్లీట్‌ మారుస్తున్నారా..? లేకపోతే.. షూట్‌కి టైమ్‌ ఉంది కాబట్టి సరదాగా ఈ లుక్‌ను ట్రై చేస్తున్నారా..? ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Also Read: పవన్ ఆత్మహత్యపై భార్య ప్రియాంక ఫస్ట్ రెస్పాన్స్.. కీలక విషయాలు వెల్లడి

ఏపీలో టెన్త్ విద్యార్థులకు గ్రేడ్లు ఇలా ఇవ్వనున్నారు..!