Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సినిమా కోసం ఆయన అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు,. సైరా సినిమా తర్వాత చిరు కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఆచార్య అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. కరోనా కారణముగా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావల్సిన ఈ మూవీ వాయిదా పడుతూ వచ్చింది. చివరకు ఆచార్య సినిమాను ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలను లైనప్ చేశారు మెగాస్టార్. బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ తో చిరు చాలా బిజీగా ఉన్నారు. ఆచార్య సినిమా తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ మూవీకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ ను ఖారురు చేశారు.
అలాగే ఈ మూవీతోపాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తమిళ్ లో సూపర్ హిట్ అయిన వేదాళం మూవీకి రీమేక్ గా రానుంది. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. కీర్తిసురేష్ మెగాస్టార్ చెల్లెలుగా కనిపించనున్నారు. ఆతర్వాత బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు చిరు. వీటితోపాటు సుకుమార్ మెగాస్టార్ ను డైరెక్ట్ చేయబోతున్నారు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. సుకుమార్ చిరుని డైరెక్ట్ చేసేది సినిమా కోసం కాదు.. ఓ యాడ్ కోసమట.. తాజాగా మెగాస్టార్ లుక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సుకుమార్ తీయబోయే యాడ్ కోసమే మెగాస్టార్ లుక్ మార్చారని టాక్ వినిపిస్తుంది. ఈ ఫొటోస్ లో చిరు డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో ఇన్షర్ట్ చేసుకొని సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నారు. మెగాస్టార్ న్యూ లుక్ చూసిన అభిమానులు బాస్ ఆల్ వేస్ బాస్ అంటూ కామెంట్ చేస్తున్నారు.