AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: “గాడ్ ఫాదర్‌లో పూరీజగన్నాథ్ నటించనున్నాడు”.. షాకింగ్ విషయం చెప్పిన చిరు

ఒక్క డైలాగ్‌ ట్వీట్తో తెలుగు టూ స్టేట్స్‌నే షేక్ చేసిన చిరు(Chiranjeevi).. మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు చిరు.

Chiranjeevi: గాడ్ ఫాదర్‌లో పూరీజగన్నాథ్ నటించనున్నాడు.. షాకింగ్ విషయం చెప్పిన చిరు
Godfather
Rajeev Rayala
|

Updated on: Sep 25, 2022 | 8:30 PM

Share

ఒక్క డైలాగ్‌ ట్వీట్తో తెలుగు టూ స్టేట్స్‌నే షేక్ చేసిన చిరు(Chiranjeevi).. మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు చిరు. దసరా కానుకగా గాడ్ ఫాదర్ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, థక్కర్ మార్ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఎన్వీ ప్రసాద్ – ఆర్ బి చౌదరి నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. రీసెంట్ గా ఈ సినిమా సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది. అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి వదులుతున్న మెగాస్టార్ పోస్టర్లు అంతకంతకూ అంచనాలు పెంచుతున్నాయి ఇక ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయన తార చిరంజీవి సిస్టర్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మెగాస్టార్ ఓ ఇంట్రవ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలో సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు మెగాస్టార్.

మెగాస్టార్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ నటిస్తున్నారని తెలిపారు. ఒక యూట్యూబర్ పాత్రలో పూరీజగన్నాథ్ కనిపించనున్నారట. అయితే ముందుగా కథ విన్నప్పుడు ఆ పాత్రలో పూరీ అయితేనే కరెక్ట్ అని భావించాం. అంతకు ముందు సోషల్ మీడియాలో పూరీ జగన్నాథ్ పాడ్ కాస్ట్ ను విన్నానని.. చాలా నచ్చాయని అందుకే ఈ పాత్ర గురించి చెప్పగానే పూరీ అయితే కరెక్ట్ అనుకున్నా అని అన్నారు చిరు. అయితే ఈ విషయం చెప్పగానే నేను చేయను అన్నాడు . కెమెరా వెనక ఉండే నేను నటించడం అది కూడా మీముందు నా వల్ల కాదు అన్నాడు. కానీ నేనే పట్టుబట్టి అతనిని ఒప్పించా అన్నారు చిరు. షూటింగ్ సమయంలో కూడా వణికిపోయాడని.. కానీ ఆ తర్వాత చాలా అద్భుతంగా నటించి మెప్పించాడని చిరు అన్నారు. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక గాడ్ ఫాదర్ సినిమా రిలీజ్ కంటే ముందే.. తన బాసిజాన్ని.. తన క్రేజ్‌ను మరో సారి అందరికీ దిమ్మతిరిగేలా రేంజ్‌లో చూపించబోతున్నారు మెగాస్టార్. అనంతపురాన్ని తన అడ్దాగా మార్చుకుని.. గాడ్ ఫాదర్ పేరును మారుమోగించనున్నారు.  చిరు మోస్ట అవేటెడ్ ఫిల్మ్ గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సెప్టంబర్ 28న అనంతపూర్‌లో నిర్వహించనున్నారు మేకర్స్ . ఇక ఇప్పటికే అనంతపూర్ లోని గవర్నమెంట్ ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాట్లు కూడా మొదలెట్టేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
నానా పటేకర్ భార్య ఎవరో తెలుసా.. ? పదేళ్ల తర్వాత..
నానా పటేకర్ భార్య ఎవరో తెలుసా.. ? పదేళ్ల తర్వాత..
.. బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిస్ ఉన్న వారికి ఇదే బెస్ట్
.. బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిస్ ఉన్న వారికి ఇదే బెస్ట్
త్రయోదశి శ్రాద్ధం ఈ పూర్వీకుల కోసమే చేస్తారా? తర్పణం, పిండదానం..
త్రయోదశి శ్రాద్ధం ఈ పూర్వీకుల కోసమే చేస్తారా? తర్పణం, పిండదానం..
10వ తరగతి, ఐటీఐతో రైల్వేలో 2,008 ఉద్యోగాలు.. నవంబర్ 6 వరకే ఛాన్స్
10వ తరగతి, ఐటీఐతో రైల్వేలో 2,008 ఉద్యోగాలు.. నవంబర్ 6 వరకే ఛాన్స్
పండగ ముందు సామాన్యులకు బిగ్‌ రిలీఫ్.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు
పండగ ముందు సామాన్యులకు బిగ్‌ రిలీఫ్.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు
లగ్జరీ లైఫ్ కాదని వ్యవసాయంతో నానా పటేకర్ అద్భుత ప్రపంచం..
లగ్జరీ లైఫ్ కాదని వ్యవసాయంతో నానా పటేకర్ అద్భుత ప్రపంచం..
ఓపెనర్లుగా అత్యధిక పరుగులు సాధించిన టాప్ 6 వీరులు వీరే
ఓపెనర్లుగా అత్యధిక పరుగులు సాధించిన టాప్ 6 వీరులు వీరే
ఆ మేయర్ సీట్లు ఎవరికి..? కూటమిలో ఎవరి లెక్కలు వారివే
ఆ మేయర్ సీట్లు ఎవరికి..? కూటమిలో ఎవరి లెక్కలు వారివే
అజిత్ అగర్కర్ బీసీసీఐ ద్వారా ఎంత సంపాదించారో తెలుసా?
అజిత్ అగర్కర్ బీసీసీఐ ద్వారా ఎంత సంపాదించారో తెలుసా?
నేషనల్ ఇన్సూరెన్స్‌ కంపెనీలో 321 ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం
నేషనల్ ఇన్సూరెన్స్‌ కంపెనీలో 321 ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం