Aacharya Movie: ‘ఆచార్య’లో చిరు ఎంట్రీ మాములుగా ఉండదంటా.. లీకైన మెగాస్టార్ ఇంట్రడక్షన్..

రీఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. రీఎంట్రీ తర్వాత ఆయన నటించిన ఖైదీ 150, సైరా సినిమాలు మంచి విజయాన్ని సాధించిన

Aacharya Movie: 'ఆచార్య'లో చిరు ఎంట్రీ మాములుగా ఉండదంటా.. లీకైన మెగాస్టార్ ఇంట్రడక్షన్..
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 04, 2021 | 9:04 PM

రీఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. రీఎంట్రీ తర్వాత ఆయన నటించిన ఖైదీ 150, సైరా సినిమాలు మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసింది. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఇందులో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాకుండా ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పూజాహెగ్డే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అటు రామ్‌ చరణ్‌  దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ప్రతిష్టాత్మక తెరకెక్కి‍స్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ క్లైమాక్స్‌ చిత్రీకరణ జరుపుకుంటోంది. దీంతో చెర్రీ ఒకేసారి రెండు మూవీ షూటింగ్‌లలో పాల్గొంటు ఫుల్‌ బిజీ ఆయిపోయాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి.. కొన్ని విషయాలు నెట్టింట్లో తెగ హాల్ చల్ చేస్తున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ దీన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇదిలా ఉండగా.. తాజా సమాచారం ప్రకారం.. ‘ఆచార్య’ కోసం మణిశర్మ అద్భుతమైన సాంగ్స్ కంపోజ్ చేశాడట. ఇందులో మొత్తం ఆరు పాటలు ఉంటాయని తెలిసింది. వీటిలో చిరంజీవి – చరణ్ మధ్య వచ్చే మాస్ సాంగ్ హైలైట్ కానుందని ఫీల్మ్ నగర్లో టాక్. అలాగే క్లైమాక్స్‌లో వచ్చే కాళికాదేవి సాంగ్‌తోనే ఫైట్ జరుగుతుందని తెలుస్తోంది. ఈ రెండూ గూస్‌బమ్స్ తెప్పించడం ఖాయమని టాక్ వినిపిస్తోంది. ‘ఆచార్య’లో శివుడికి సంబంధించిన పాట ఒకటి.. చిరంజీవి – కాజల్ మధ్య మరొకటి.. చరణ్ – పూజా హెగ్డే మధ్య ఇంకొకటి ఉంటుందని సమాచారం. ఇక, చిరంజీవి – రెజీనా మధ్య వచ్చే స్పెషల్ సాంగ్ అన్నింటిలో హైలైట్‌గా నిలవబోతుందని సమాచారం. మెగాస్టార్ కెరీర్‌లోనూ గతంలో ఎన్నడూ చూడని స్టెప్పులు, గ్రేస్ ఇందులో కనిపిస్తుందని టాక్. ఇక, చరణ్‌ ఎంట్రీ బ్యాగ్రౌండ్ స్కోర్ అరుపులు పెట్టిస్తుందని సమాచారం.

Also Read:

బంపర్ ఆఫర్ కోట్టెసిన బిగ్‏బాస్ బోల్డ్ బ్యూటీ.. మెగా హీరో సినిమాలో ఛాన్స్.. ఎంతకీ ఏ పాత్రంటే..