Megastar Chiranjeevi: అల్లు అర్జున్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన చిరంజీవి.. ఏమన్నారంటే..

ఇటీవలే వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ నిర్వహించి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది చిత్రబృందం. ఇక మంగళవారం ఈ మూవీ సక్సెస్ పై మీడియోకు ప్రత్యేక ఇంటర్వ్యూస్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు మెగాస్టార్.

Megastar Chiranjeevi: అల్లు అర్జున్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన చిరంజీవి.. ఏమన్నారంటే..
Chiranjeevi, Allu Arjun

Edited By:

Updated on: Jan 19, 2023 | 8:25 AM

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చిరు నటించిన ఈ సినిమా జనవరి 13న విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. మాస్ యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇందులో శ్రుతి హాసన్ కథానాయికగా నటించగా.. మాస్ మాహారాజా రవితేజ కీలకపాత్రలలో నటించారు. ఇటీవలే వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ నిర్వహించి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది చిత్రబృందం. ఇక మంగళవారం ఈ మూవీ సక్సెస్ పై మీడియోకు ప్రత్యేక ఇంటర్వ్యూస్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు మెగాస్టార్. బన్నీ స్టార్‏గా ఎదగడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు.

చిరంజీవి మాట్లాడుతూ.. వాల్తేరు వీరయ్య విజయం సమిష్టి అని.. ఈ సినిమా కోసం ప్రతి ఒక్క టెక్నీషియన్, నటీనటులు ఎంతో కష్టపడ్డారని అన్నారు. ఇక అనంతరం బన్నీ గురించి మాట్లాడారు. కెరీర్ పరంగా అల్లు అర్జున్ ఎదుగుతున్న విధానాన్ని చూస్తుంటే ఎంతో మచ్చటేస్తోందని అన్నారు. కెరీర్ ఆరంభం నుంచి ఎంతో కష్టపడుతున్న బన్నీ.. ఇప్పుడు పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గొప్ప క్రేజ్ అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని.. తప్పుకుండా రాబోయే రోజుల్లో మరింత ఉన్నత స్థాయికి ఎదగడం ఖాయం అని.. అతనికి తన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని అన్నారు.

ప్రస్తుతం బన్నీ.. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న పుష్ప సీక్వెల్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఇందులో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తోంది. అలాగే మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలకపాత్రలలో నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us