ప్రిరిలీజ్ ఈవెంట్ కు ఆంధ్రయూనివర్సిటీ ముస్తాబవుతుంది. ఇప్పటికే ఈవింట్ ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ వేడుకకు భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు విశాఖ పోలీసులు. అడిషనల్ ఎస్పీ అధ్వర్యంలో ఐదుగురు ఏసీపీలు,12 మంది సీఐలు.. 30మంది ఎస్‌ఐలు, 400 మంది పోలీసులతో కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఈవెంట్ లో పాల్గొనేదుకు 30 వేల మందికి పాస్‌లు జారీ చేసింది చిత్ర యూనిట్. ఇప్పటికే రిలీజైన వాల్తేరు వీరయ్య ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. దీంతో ఈ మూవీ పై అభిమానుల అంచనాలు పెరిగాయి. సాయంత్రం జరిగే ప్రిరిలీజ్ వేడుకకు హైదరాబాద్ నుంచి స్పెషల్ చార్టెడ్ ప్లైట్‌లో విశాఖకు బయలుదేరి వెళ్లారు మెగాస్టార్ చిరంజీవి.. మాస్ మాహారాజా రవితేజ. అయితే శనివారం రాత్రి వరకు ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించి గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. ముందుగా ఆర్కే బీచ్ అంటూ చిత్రయూనిట్ ప్రకటించగా.. ఏయూలో నిర్వహించాలని సూచించారు విశాఖ పోలీసులు.
ఆ తర్వాత మళ్లీ ఆర్కే బీచ్‌లో నిర్వహించుకోవడానికి అనుమతులు ఇవ్వడంతో ప్రీరిలీజ్ వేడుక ఏర్పాట్లు స్టార్ చేశారు. చివరగా..మరోసారి వేడుక అనుమతులు రద్దు చేస్తూ.. ఏయూలో జరుపుకునేందుకు పర్మిషన్ ఇవ్వడంతో వాల్తేరు వీరయ్య్ ప్రీరిలీజ్ వేడుకపై అభిమానులలో గందరగోళం నెలకొంది.ఇక ఎట్టకేలకు ఈ వేడకకు ఆంధ్రయూనివర్సిటీ ముస్తాబవుతుంది. తాజాగా ఈ వేదికపై మార్పుపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.
చిరంజీవి మాట్లాడుతూ.. “వాల్తేరు వీరయ్య సినిమా అద్భుతంగా ఉంటుంది. అభిమానుల అంచనాలను రీచ్ అవుతాం. వారి వారి కంఫర్ట్ ను బట్టి పర్మిషన్ ఇస్తారు” అంటూ చెప్పుకొచ్చారు. ఇక మాస్ మాహారాజా రవితేజ మాట్లాడుతూ.. వాల్తేరు వీరయ్యతో అభిమానుల అంచనాలను అందుకుంటామని.. ప్రీరిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి, హీరో రవితేజ చిరు పెద్ద కూతురు సుస్మిత, చిన్న కుమార్తె శ్రీజ, అలీ, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు స్పెషల్ ఫ్లైట్ లో వైజాగ్ బయలుదేరి వెళ్లారు.
సాయంత్రం జరిగే ప్రిరిలీజ్ వేడుకకు హైదరాబాద్ నుంచి స్పెషల్ చార్టెడ్ ప్లైట్‌లో విశాఖకు బయలుదేరి వెళ్లారు మెగాస్టార్ చిరంజీవి.. మాస్ మాహారాజా రవితేజ. అయితే శనివారం రాత్రి వరకు ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించి గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..