Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి మరో అవార్డ్.. ఒకే వేదికపై చిరు, బాలయ్య, వెంకీ..

|

Sep 28, 2024 | 10:58 AM

టాలీవుడ్ అగ్ర హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేశ్ కుటుంబంతో కలిసి ఈ వేడుకలో సందడి చేశారు. ఇందులో భాగంగానే ప్రతిష్టాత్మక 'ఔట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా' పురస్కారం అందుకున్నారు చిరు. ఈ అవార్డును బాలకృష్ణ, వెంకటేశ్ చేతుల మీదుగా చిరంజీవి అందుకున్నారు.

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి మరో అవార్డ్.. ఒకే వేదికపై చిరు, బాలయ్య, వెంకీ..
Megastar Chiranjeevi
Follow us on

సినీరంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఐఫా అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. దుబాయ్ వేదికగా కన్నుల విందుగా జరిగిన ఐఫా 2024 వేడుకలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ స్టార్ సెలబ్రెటీస్ అందరూ ఇందులో పాల్గొన్నారు. టాలీవుడ్ అగ్ర హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేశ్ కుటుంబంతో కలిసి ఈ వేడుకలో సందడి చేశారు. ఇందులో భాగంగానే ప్రతిష్టాత్మక ‘ఔట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా’ పురస్కారం అందుకున్నారు చిరు. ఈ అవార్డును బాలకృష్ణ, వెంకటేశ్ చేతుల మీదుగా చిరంజీవి అందుకున్నారు. చాలా కాలం తర్వాత ముగ్గురు కలిసి ఓకే స్టే్జ్ పై ఫోటోలకు ఫోజులివ్వడం చూసి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల బాలకృష్ణ 50 ఏళ్ల సినీ వేడుకలోనూ టాలీవుడ్ స్టార్స్ అంతా ఒకే స్టేజ్ పైకి వచ్చి కన్నుల విందు చేశారు. ఇక ఇప్పుడు మళ్లీ చిరు, వెంకీ, బాలయ్య కలిశారు. ప్రతిష్ట్మాతక ఐఫా వేడుకల్లో పాల్గొన్న ఈ స్టార్స్ ఫ్యాన్స్ కోసం కలిసి ఫోటోఫోజ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట ట్రెండ్ అవుతుండగా.. ముగ్గురు స్టార్స్ ఓకే ఫ్రేములో కనిపించడం సంతోషంగా ఉందని.. అలాగే వీరంతా కలిసి ఒక సినిమా చేయాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఏడాది ఉమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ హీరోయిన్ సమంత అందుకుంది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ ముగ్గురు స్టార్ హీరోస్ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు చిరంజీవి విశ్వంభర సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. అలాగే బాలయ్య, వెంకీ సైతం తమ కొత్త ప్రాజెక్టు చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఇక ఈ ముగ్గురు కలిసి నటిస్తే ఎలా ఉంటుందో అనే చర్చ ఇప్పుడు నెట్టింట జరుగుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.