GodFather: గాడ్‏ఫాదర్ షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్.. మెగా ఫ్యాన్స్ కోసం..

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చేతినిండా సినిమాలతో బిజీగా గడిపేస్తున్నారు. ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి

GodFather: గాడ్‏ఫాదర్ షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్.. మెగా ఫ్యాన్స్ కోసం..
Godfather
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 22, 2021 | 4:28 PM

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చేతినిండా సినిమాలతో బిజీగా గడిపేస్తున్నారు. ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఆచార్య సినిమా పూర్తిచేసిన సంగతి తెలిసందే. ఈ మూవీ తర్వాత తన తదుపరి చిత్రాలను కూడా పట్టాలెక్కించాడు. అయితే ఆచార్య తర్వాత మెగాస్టార్ చేస్తున్న రీమేక్ మూవీ గాడ్ ఫాదర్. మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ చిత్రానికి తెలుగు రీమేక్‏గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నప్పటికీ.. ఒరిజినల్ స్టోరీలోని ప్లాట్‏ను చిరంజీవి ఇమేజ్‏కు తగినట్లుగా మార్పులు చేశారట డైరెక్టర్ మోహన్ రాజా. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీని ఇటీవలే సెట్స్ పైకీ తీసుకెళ్లారు. ఇందులో చిరు పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారట.

ఇదిలా ఉంటే.. గత నెలలో ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ హైదరాబాద్‏లో ప్రారంభమైంది. ఇందులో కేవలం చిరంజీవితో హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ మాత్రమే చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ న్యూ షెడ్యూల్ ప్రారంభమైంది. ఇందుకోసం చిత్రయూనిట్‏తోపాటు.. మెగాస్టా్ర్ కూడా ఊటీ వెళ్లినట్లుగా సమచారం. ఈ షెడ్యూల్‏లో చిరంజీవితోపాటు.. ఇతర నటీనటులపై కూడా టాకీ పార్ట్ చిత్రీకరించనున్నారట. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. ఆర్బీ చౌదరీ, ఎన్వీ ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక చిరు.. కాజల్ జంటగా నటించిన ఆచార్య సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రామ్ చరణ్, పూజా హెగ్డే కీలకపాత్రలలో నటించారు.

చిరంజీవి ఇన్‏స్టా..

Also Read: Nayanthara: షారుఖ్.. అట్లీ సినిమాలో నయనతార రోల్ అదే.. సెట్ నుంచి లీకైన ఫోటోస్..

Megastar Chiranjeevi: ఈరోజు చిరంజీవికి చాలా స్పెషల్ డే.. ఆసక్తికర ట్వీట్ చేసిన మెగాస్టార్..