Vishwambhara Movie: మెగాస్టార్ బర్త్ డే ట్రీట్ వచ్చేసింది.. ‘విశ్వంభర’లో చిరు ఫస్ట్ లుక్ చూశారా..?

|

Aug 22, 2024 | 11:28 AM

ఈరోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ ప్రముఖులు, అభిమానులు చిరుకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. మరోవైపు చిరు సినిమాలు...కొత్త ప్రాజెక్ట్ గురించి ఏమైనా అప్డేట్స్ వస్తాయా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలో తాజాగా విశ్వంభర మేకర్స్ మెగా అభిమానులకు స్పెషల్ ట్రీట్ అందించారు. ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

Vishwambhara Movie: మెగాస్టార్ బర్త్ డే ట్రీట్ వచ్చేసింది.. విశ్వంభరలో చిరు ఫస్ట్ లుక్ చూశారా..?
Vishwambhara
Follow us on

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ సినిమా విశ్వంభర. బింబిసార సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వశిష్ఠ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుండగా.. కొన్ని నెలలుగా మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమా అప్డేట్స్ కోసం చాలారోజుల మెగా ఫ్యా్న్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. కానీ ఈరోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ ప్రముఖులు, అభిమానులు చిరుకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. మరోవైపు చిరు సినిమాలు…కొత్త ప్రాజెక్ట్ గురించి ఏమైనా అప్డేట్స్ వస్తాయా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలో తాజాగా విశ్వంభర మేకర్స్ మెగా అభిమానులకు స్పెషల్ ట్రీట్ అందించారు. ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

కాసేపటి క్రితం విశ్వంభర సినిమా నుంచి ఓ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో చిరంజీవి త్రిశూలం పట్టుకొని ఓ భారీ కొండపై కొత్త లోకంలోకి వెళ్తున్నట్లు ఉంది. సిస్టర్ సెంటిమెంట్ తోపాటు సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తు్న్నారు. తాజాగా విడుదలైన పోస్టర్ చూస్తుంటే సినిమాపై మరింత ఆసక్తి ఏర్పడింది. ఈ సినిమాలో త్రిషతోపాటు కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ కూడా నటిస్తుంది. అయితే ముందు నుంచి ఈ సినిమా టీజర్ రిలీజ్ అవుతుందని అనుకున్నారు అంతా. కానీ టీజర్ విడుదలకు ఇంకా టైమ్ పడుతుందని ఇదివరకే క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ వశిష్ఠ.

ఇవి కూడా చదవండి

ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేయనున్నారు. ప్రస్తుతం విడుదలైన విశ్వంభర ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని టాక్. చిరు కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా ఇది. ఈ సినిమా కోసం 13 భారీ సెట్ లతో ఓ ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించారు. అలాగే ఇంతకు ముందు ఎప్పుడూ చూడని చిరంజీవి కనిపించనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.