Megastar Chiranjeevi: సంబరాలు మొదలెట్టిన అభిమానులు.. మెగాస్టార్‏కు వినూత్న రీతిలో శుభాకాంక్షలు..

|

Aug 22, 2021 | 8:51 AM

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ ఓ ప్రభంజనం. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన ఓ సంచలనం. తెలుగు సినీసీమలో అగ్ర కథనాయకుడిగా ఎదిగిన చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా.

Megastar Chiranjeevi: సంబరాలు మొదలెట్టిన అభిమానులు.. మెగాస్టార్‏కు వినూత్న రీతిలో శుభాకాంక్షలు..
Chiru
Follow us on

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ ఓ ప్రభంజనం. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన ఓ సంచలనం. తెలుగు సినీసీమలో అగ్ర కథనాయకుడిగా ఎదిగిన చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా.. అత్యున్నత శిఖరాలను అందుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ సినీ పరిశ్రమలో మెగాస్టార్‏గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు. చిరంజీవి.. తనదైన స్లైలీష్ స్టెప్పులతో, నటనతో సినీ పరిశ్రమ గతిని మార్చిన నిత్య శ్రామికుడిగా నిలిచాడు. దశాబ్ధాలుగా చిత్రసీమను ఏలుతున్న చిరంజీవికి.. అభిమానులు ఎంతో మంది. చిరంజీవిని.. మెగాస్టార్, అన్నయ్య, చిరు అంటూ పిలుచుకుంటుంటారు. కేవలం సినిమాల్లోనే కాకుండా.. నిజ జీవితంలోనూ ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తూ.. అడిగిన వారికి సాయం చేయడంలో ముందుంటాడు చిరంజీవి. ఈరోజు (ఆగస్ట్ 22) మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఇప్పటికే ఆయన అభిమాన సంఘాలు సంబరాలు మొదలెట్టారు. ఆయనకు సంబంధించిన పాత ఫోటోలను, బర్త్ డే కవర్ ఫోటోలను, సినిమా విశేషాలను షేర్ చేస్తూ.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఇప్పటికే చిరు తదుపరి సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఇప్పటికే విడుదలైన అభిమానులను మరింత ఆనందంలో ముంచెత్తాయి.

Chiranjeevi

ఇదిలా ఉంటే.. ఈరోజు చిరు పుట్టిన రోజు కావడంతో ఆయనకు పలువురు సినీ ప్రముఖులు, అభిమాన తారగణం సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఓ అభిమాని మాత్రం మెగాస్టార్ చిరంజీవికి వినూత్న్ రీతిలో శుభాకాంక్షలు తెలిపాడు. గద్వాల్ ప్రాంతానికి చెందిన జయరాజ్ మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. తన అభిమాన హీరోకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడానికి నెల రోజుల క్రితం గద్వాల్ నుంచి 231 కిలోమీటర్లు నడుచుకుంటూ తమ హీరోను కలవడానికి పాదయాత్ర చేసుకుంటూ వచ్చారు. పేదవాడు అయినప్పటికీ ఎంతో ఖర్చు పెట్టి ఒక ఆర్ట్ వేసి చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు.

వీడియో..

Also Read: Sumanth: ఏంటో ఏమో జీవితం.. ఎందుకిలా చేస్తాదో జీవితం లిరికల్ సాంగ్ రిలీజ్.. వైవిధ్యంగా మళ్లీ మొదలైంది..

Chiranjeevi Birthday: చిరంజీవి బ్లడ్‌ బ్యాంకు ఏర్పాటు చేయడానికి కారణమేంటో తెలుసా? ఆయన ఆలోచన మార్చిన ఆ సంఘటన ఏంటంటే.

Shruti Hassan: ఫుడ్‌, సెక్స్‌లో శృతీ హాసన్‌ ప్రాధాన్యత దేనికో తెలుసా.? ఆసక్తికర ముచ్చట్లు చెప్పుకొచ్చిన శృతీహాసన్‌.