Megastar Chiranjeevi: ‘నా నటనను సరిదిద్దిన గురువు ఆయనే’.. డైరెక్టర్ విశ్వనాధ్‏తో అనుబంధాన్ని తలుచుకుని చిరంజీవి ఎమోషనల్..

|

Feb 20, 2023 | 7:21 AM

లెజండరీ డైరెక్టర్ విశ్వనాధ్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని కళాతపస్వకి కళాంజలి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవితోపటు.. విశ్వనాధ్ తో కలిసి పనిచేసిన నటీనటులు హాజరై.. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

Megastar Chiranjeevi: నా నటనను సరిదిద్దిన గురువు ఆయనే.. డైరెక్టర్ విశ్వనాధ్‏తో అనుబంధాన్ని తలుచుకుని చిరంజీవి ఎమోషనల్..
Megastar Chiranjeevi
Follow us on

దర్శకుడిగా అనుక్షణం నా నటనను సరిదిద్దిన గురువుగా.. చిత్రీకరణ సమయంలో ఆయన చూపించే ప్రేమలో తండ్రిగా విశ్వనాధ్ గారిని భావిస్తా అన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. విశ్వనాధ్ దర్శకత్వంలో తాను మూడు సినిమాలు చేశానంటూ తెలిపారు. లెజండరీ డైరెక్టర్ విశ్వనాధ్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని కళాతపస్వకి కళాంజలి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవితోపటు.. విశ్వనాధ్ తో కలిసి పనిచేసిన నటీనటులు హాజరై.. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ “ఇది విశ్వనాధ్ గారి సంతాప సభలా ఉండకూడదు… ఓ సంబరంలా ఉండాలి. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకోవాలి అని మేం అందరం అనుకున్నాం. దర్శకులు కాశీ విశ్వనాధ్.. వీఎస్ ఆదిత్య, సంతోషం సురేష్, ఏడిద రాజా, పీపుల్ మీడియా సంస్థ, టీ. సుబ్బరామిరెడ్డి తదితరుల సహకారంతో ఇది సాధ్యమైంది. ఆయన ఆత్మ శాంతిస్తుందని విశ్వసిస్తున్నా.. ఆయనను నేను మూడు కోణాల్లో చూస్తుంటా.. మూడు సినిమాల్లో నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడిగా.. అనుక్షణం నా నటనను సరిదిద్ధిన గురువుగా.. చిత్రీకరణ సమయంలో చూపించిన ప్రేమ విషయంలో తండ్రిగా భావిస్తాను. నేను నటుడిగా నిలదొక్కుకుంటున్న సమయంలో శుభలేఖలో నటించే అవకాశం ఇచ్చారు.

విశాఖపట్నంలో నిర్వహించిన తొలిరోజు షూటింగ్ లో నా దగ్గరకు ఆయన వచ్చి నిన్ను ఎవరైనా తరుముతున్నారా ? అంత వేగంగా సంభాషణ చెబుతున్నావు అని అడిగారు.. దీంతో కంగారు వస్తుందని చెప్పాను.. డైలాగ్ చెప్పడంలో నా స్పీడ్ ను నియంత్రించి.. సరిగ్గా చెప్పేందుకు నాకు బీజం పడింది అక్కడే. నటుల్లోని ఒరిజినాలిటీని ఆయన చక్కగా రాబట్టుకునేవారు. ఆయన చెప్పేంతవరకు నాకు తెలియదు నాకు క్లాసికల్ డ్యాన్స్ చేయగలనని… పూర్తి స్థాయిలో మాస్ యాక్షన్ చిత్రాలు చేస్తున్న సమయంలో స్వయంకృషి కథ వినిపించారు. ఎప్పటికప్పుడు నన్ను ప్రోత్సహించేవారు. సున్నితంగా నటించడం కూడా ఆయన వద్దే నేర్చుకున్నాను. మా కాంబోలో వచ్చిన ఆపద్భాంధవుడు మరో అపురూప చిత్రం” అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.