Chiranjeevi: చిరంజీవిని కలిసేందుకు డబ్బులు వసూలు.. వారిపై మెగాస్టార్ ఆగ్రహం

|

Mar 21, 2025 | 10:29 AM

మెగాస్టార్ చిరంజీవి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. సినీ కళామతల్లికి చిరంజీవి అందించిన సేవలకు గుర్తింపుగా హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌- యూకే పార్లమెంట్‌ ఆయనకు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ పురస్కారంతో సత్కరించింది. దీంతో చిరంజీవి కి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Chiranjeevi: చిరంజీవిని కలిసేందుకు డబ్బులు వసూలు.. వారిపై మెగాస్టార్ ఆగ్రహం
Chiranjeevi
Follow us on

మెగాస్టార్ చిరంజీవి మరో అరుదైన ఘనత అందుకున్నారు. సినిమా రంగానికి ఆయన అందించిన సేవలు సామాజిక కార్యక్రమాలకు ప్రతీకగా హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌- యూకే పార్లమెంట్‌లో చిరంజీవిని ఘనంగా సత్కరించారు. అలాగే ప్రతిష్ఠాత్మక లైఫ్‌ టైమ్ అచీవ్‌మెంట్‌ పురస్కారాన్ని మెగాస్టార్ కు ప్రదానం చేశారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు చిరంజీవికి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే చిరంజీవి క్రేజ్ ను కొందరు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించారు. లండన్ కు వెళ్లిన ఆయనను కలిసేందుకు కొందరు ఫ్యాన్‌ మీట్‌ పేరుతో డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించారు. ఈ విషయం చిరంజీవి దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు.

 

ఇవి కూడా చదవండి

‘ప్రియమైన అభిమానులారా..! లండన్ లో నన్ను కలిసేందుకు మీరు చూపిన ప్రేమ, వాత్సల్యం నా మనసును తాకింది. ఈ క్రమంలో ఫ్యాన్‌ మీటింగ్‌ పేరుతో కొందరు డబ్బులు వసూలు చేయడం నా దృష్టికి వచ్చింది. ఇలాంటి అనుచిత ప్రవర్తను నేను అస్సలు సహించను. నేను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఫ్యాన్స్‌ మీటింగ్‌ పేరుతో ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే, వెంటనే తిరిగి వారికి ఇచ్చేయండి. ఇలాంటి వాటి విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఎప్పుడు, ఎక్కడా కూడా నేను ఇలాంటి వాటిని ప్రోత్సహించనని గుర్తించండి. మన మధ్య ఉన్న ప్రేమ, అనుబంధం వెలకట్టలేనిది. నేను ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు ఒప్పుకోను. సహించను. మన ఆత్మీయ కలయికలను స్వచ్ఛంగా, స్వలాభార్జనకు దూరంగా ఉంచుదాం’ అని సూచించారు చిరంజీవి.

 మెగాస్టార్ చిరంజీవి ట్వీట్..

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ నెట్టింట వైరలవుతోంది.

లండన్ లో చిరంజీవికి సన్మానం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.