సీఎం విజయ్‌కు ఫోన్ చేసిన చిరంజీవి.. హృదయపూర్వక అభినందనలు తెలిపిన మెగాస్టార్

మొన్నటివరకు ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా రాణించిన దళపతి విజయ్ ఇప్పుడు తమిళనాడు సీఎంగా పదవి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీయే ఎన్నికల్లో విజయ్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. దాంతో ఇప్పుడు విజయ్ సీఎంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

సీఎం విజయ్‌కు ఫోన్ చేసిన చిరంజీవి.. హృదయపూర్వక అభినందనలు తెలిపిన మెగాస్టార్
Chiranjeevi, Vijay

Updated on: May 15, 2026 | 7:40 PM

ఇటీవలే తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు నటుడు విజయ్. మొన్నటివరకు స్టార్ హీరోగా రాణించిన విజయ్.. ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో విజయ్ భారీ విజయాన్ని అందుకున్నారు. తొలి ఎన్నికల్లోనే విజయం సాధించడంతో పాటు ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టారు. విజయ్ సీఎం అవ్వడంతో సినీ ఇండస్ట్రీ మొత్తం ప్రశంసలు కురిపిస్తున్నారు తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు ఫోన్ చేసిన మెగాస్టార్ చిరంజీవి.. ఇద్దరి మధ్య ఆత్మీయమైన ఫోన్ సంభాషణ జరిగిందని తెలుస్తుంది.

ఇది కూడా చదవండి : నువ్వొద్దు.. నీ పాటలొద్దు..! బాలసుబ్రహ్మణ్యంతో గొడవపడ్డ ఒకే ఒక్క హీరో.. చివరకు ఏం జరిగిందంటే

ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్‌కు మెగాస్టార్ చిరంజీవి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రజాకేంద్రీకృత పాలనతో తమిళనాడు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని, దివంగత మహానేత MGRలా ప్రజల ప్రేమాభిమానాలు పొందాలని ఆకాంక్షించారు. విజయ్ కూడా మెగాస్టార్ చిరంజీవికి ధన్యవాదాలు తెలుపుతూ..

ఇది కూడా చదవండి : OTT Movie : IMDB 7.4 రేటింగ్‌.. వణికిస్తున్న థ్రిల్లర్ మూవీ.. ఏకంగా ఆరు ఓటీటీల్లో

ఇటీవల ‘మనశంకర వరప్రసాద్ గారు’ చిత్రం చూసినట్లు చెప్పారు.. అందులో చిరంజీవి గారిని తెరపై చూడటం ఎంతో ఆనందంగా అనిపించిందని తెలిపారు విజయ్. అలాగే KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న చిరంజీవి గారి తదుపరి చిత్రానికి తన శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం విజయ్… గతంలో విజయ్ తండ్రి, దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్‌తో సినిమాలు చేశారు చిరంజీవి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Siddarth: నా సినిమాలకు నంది అవార్డులు వచ్చాయి.. కానీ నన్ను పట్టించుకోలేదు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us