Chiru-Venky: గత కొంతకాలంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ మూవీస్ తెరకెక్కుతున్నాయి. ప్రేక్షకులు కూడా ఇటువంటి సినిమాలను ఆదరిస్తున్నారు. స్టార్ హీరోలు సైతం.. తమకు సినిమా కథ నచ్చితే చాలు ఇతర హీరోలతో తెరపంచుకోవడానికి ఒకే అంటున్నారు. వరస సినిమాలతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే గాడ్ ఫాదర్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో కలిసి నటిస్తున్నారు. తాజాగా మరో చిరంజీవి సినిమాలో స్టార్ హీరో అతిధిగా నటించనున్నట్లు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాలో విక్టరీ వెంకటేష్ తో కలిసి నటిస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో అభిమానులు చిరు, వెంకీలు కలిసి నటిస్తే.. చూడడానికి రెండు కళ్ళు చాలవంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాతో బిజీగా ఉన్న చిరు నెక్స్ట్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్ లో పాల్గొనున్నారు. ఇప్పటికే పూజాదికార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను పూర్తి స్థాయిలో పట్టాలెక్కించడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతుంది.
బాబీ దర్శకత్వంలో మైత్రి మూవీస్ క్రియేషన్స్ నిర్మిస్తున్న వాల్తేర్ వీరయ్య సినిమాలో చిరంజీవి మరోసారి మత్స్యకారకుడుగా కనిపించనున్నట్లు టాక్. ఈ సినిమాలో జాలర్లకు లీడర్ గా కనిపించనున్నారట. మత్స్యకారుల జీవితంపై పెత్తనాన్ని చేస్తున్న మార్కెట్ ఆధిపత్యాన్ని నాయకుడిగా ప్రశ్నిస్తూ.. వారిని నడిపిస్తాడని.. అయితే ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ముఖ్య పాత్రలో అతిధిగా నటించనున్నారని ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్. చిరంజీవితో ఉన్న ఫ్రెండ్ షిప్ తో అతిధిగా నటించడానికి అంగీకరించి నట్లు ఓ టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తల్లో నిజం ఎంత ఉందొ తెలియాలంటే చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. చిరుకి జంటగా శృతి హాసన్ నటిస్తుండగా.. సముద్ర ఖని, బాబీ సింహా, కేథరిన్ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..