Actor Nassar: విలక్షణ నటుడు నాజర్‌తో పాటు యాక్టింగ్ స్కూల్‌లో నటన నేర్చుకున్న స్టార్ హీరోలు.. ఎవరో తెలుసా..!

Actor Nassar: దక్షిణ చలన చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడు అనగానే గుర్తుకొచ్చే నటుల్లో ఒకరు నాజర్.  పాత్ర ఏదైనా సరే.. ఆ పాత్రకు జీవం పోసే నటుడు నాజర్. ఇంకా చెప్పాలంటే క్యారెక్టర్ ఆర్టిస్టుగా..

Actor Nassar: విలక్షణ నటుడు నాజర్‌తో పాటు యాక్టింగ్ స్కూల్‌లో నటన నేర్చుకున్న స్టార్ హీరోలు.. ఎవరో తెలుసా..!
Senior Actor Nassar
Follow us

|

Updated on: Sep 27, 2021 | 1:42 PM

Actor Nassar: దక్షిణ చలన చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడు అనగానే గుర్తుకొచ్చే నటుల్లో ఒకరు నాజర్.  పాత్ర ఏదైనా సరే.. ఆ పాత్రకు జీవం పోసే నటుడు నాజర్. ఇంకా చెప్పాలంటే క్యారెక్టర్ ఆర్టిస్టుగా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దక్షిణాది నటులు అతి కొద్దీ మంది. వారిలో ఒకరు నాజర్. పాత్ర ఏదైనా సరే.. ఆ పాత్రలో ఒదిగిపోయి నటిస్తారు.  తాగుబోతు భర్తగా, తాత , విలన్, తండ్రి ఏ పాత్రలో నటించినా నాజర్ తన నటనతో ప్రేక్షకుల మదిగదిని తాకుతారు. ఇక బాహుబలి సినిమాలో నాజర్ నటనకు దక్కిన గుర్తింపు అందరికీ తెలిసిందే. అయితే సినిమాల్లో మంచి ఆరిస్టుగా ఖ్యాతిగాంచిన నాజర్ మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ కూడా..   మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో బోటనీతో డిగ్రీ పట్టా పుచ్చుకున్నాడు. చదువుకుంటున్న రోజుల్లో నటనపై ఆసక్తి కలిగి.. నాటకాలలో నటించడం మొదలు పెట్టారు.  ఓ వైపు సినిమాల్లో నటించడానికి అవకాశాలను వెదుకుతూనే  1977 లో తాజ్ కోరమాండల్ హోటల్ లో పనిచేశారు. అక్కడ నుంచే తన సినీ ప్రస్థానం ప్రారంభమైందని పలు సందర్భాల్లో నాజర్ చెప్పారు కూడా  . సినిమాల్లోకి అడుగు పెట్టిన తర్వాత అవకాశాల కోసం ఎక్కువ సమయం ఎదురుచూడాల్సిన పనిలేకుండా నాజర్ కు పలు సినిమాల్లో అవకాశాలు వెదుకుకుంటూనే వచ్చాయి.

ఇక నాజర్ మంచి నటుడే కాదు.. మల్టీటాలెంటెడ్ పర్సన్. మంచి రచయిత. ఆయన రాసిన కవితలు, కథలు, వ్యాసాలు ఎన్నో పత్రికలు ముద్రించాయి. ఇక నాజర్ నటనలో మాస్టర్ డిప్లమా చేశారు. తన నటనకు గాను గోల్డ్ మెడల్ కూడా సొంతం చేసుకున్నారు. అయితే ఇక్కడ విశేషం అంటే.. నాజర్ చేరిన యాక్టింగ్ స్కూల్ లో రజనీకాంత్, విజయ్ కాంత్ లాంటి టాప్ హీరోలు సైతం జాయిన్ అయ్యారు. ఇక చిరంజీవి కూడా నాజర్ క్లాస్ మేట్.  యాక్టింగ్ స్కూల్ నుంచి చిరంజీవి నాజర్ కు మధ్య మంచి స్నేహం ఉందట.. అయితే తాము ఇద్దరం కలిపి నటించడానికి 30 ఏళ్ళు పట్టిందని చెప్పారు. చిరు, నాజర్ కలిసి ఖైదీ నెంబర్ 150 సినిమాలో నటించారు. మొత్తానికి నాజర్ తో పాటు నటన నేర్చుకున్న రజని కాంత్, విజయ్ కాంత్ , చిరంజీవి వంటివారు స్టార్ హీరోలుగా ఖ్యాతిగాంచారు.

ఇక నాజర్ టాలీవుడ్ లో , కోలీవుడ్ లో అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. చంటి , మాతృదేవోభవ,  బాంబే ,   జీన్స్ , అతడు చిత్రాలలో అద్వితీయమైన నటన ప్రదర్శించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. చంటి , మాతృదేవోభవ సినిమాల్లో నటనకు గాను నంది అవార్డులను ఏపీ ప్రభుత్వం నుంచి నంది అవార్డులను అందుకున్నారు. ఇక తెలుగులో యండమూరి వీరేంద్రనాథ్, అంపశయ్య నవీన్ రచనలంటే ఇష్టమని చెప్పే నాజర్ కు చలం మైదానం నవల  ఎంతో ఇష్టమట.

Also Read:

పుష్ప షూటింగ్ లోకేషన్ స్పాట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. అందమైన ఫోటో షేర్ చేసిన మేకర్స్.. మీరు చూశారా ?

అసలైన పోరు ఈరోజు నుంచే.. టాలీవుడ్‏లో ఎన్నికల జోరు.. నామినేషన్ వేయనున్న ప్రకాష్ రాజ్ అండ్ టీం..